ఆదివారం జరిగిన 'సైరా' ప్రీరిలీజ్ వేడుకలో మెగా కుటుంబం సందడి చేసింది. ఈ కార్యక్రమంలో రామ్చరణ్ భార్య ఉపాసన తళుక్కున మెరిసింది. అక్కడి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. కానీ ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఓ ఫొటో తీయడం.
సామాజిక మాధ్యమాల్లో వీటిని షేర్ చేసిన ఉపాసన.. ఈవెంట్కు ముందు ఈ ఫొటోషూట్ జరిగిందని చెప్పింది.
'సైరా' వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి వినాయక్, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు. తమిళ నటుడు విజయ్ సేతుపతి కార్యక్రమంలో సందడి చేశాడు. వచ్చే నెల 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇవీ చూడండి.. ఒక్కడు 2.0: మళ్లీ అదే లొకేషన్లో మహేశ్