ETV Bharat / sitara

మెగాస్టార్​ కొత్త సినిమాలో హీరోయిన్​ లేదట! - చిరంజీవి సుజిత్​ న్యూస్​

మెగాస్టార్​ చిరంజీవి ఇటీవలే తన తర్వాతి మూడు చిత్రాలపై క్లారిటీ ఇచ్చారు. ఇందులో 'లూసిఫర్​' రీమేక్​ తెరకెక్కించే బాధ్యతను యువ దర్శకుడు సుజిత్​కు అప్పగించారు. ఈ సినిమాలో హీరోయిన్​ పాత్ర లేకపోయినా కమర్షియల్​ హంగుల కోసం ఓ ఐటెంసాంగ్​కు ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం.

Megastar Chiranjeevi's new movie has no heroine
మెగాస్టార్​ కొత్త సినిమాలో హీరోయిన్​ లేదట
author img

By

Published : Apr 24, 2020, 1:41 PM IST

మెగాస్టార్​ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'(వర్కింగ్​ టైటిల్​)లో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత నటించే మూడు సినిమాలపై ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. 'సాహో' దర్శకుడు సుజిత్​​, బాబీ, మెహర్​ రమేశ్​ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలిపారు. మలయాళ సినిమా 'లూసిఫర్'​ రీమేక్​కు దర్శకత్వం వహిస్తున్న సుజిత్​ ఇప్పటికే స్క్రిప్ట్​ వర్క్​ మొదలు పెట్టారు. మాతృకలో మోహన్​లాల్​ ప్రధానపాత్ర పోషించారు.

పొలిటికల్​, యాక్షన్​ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో మోహన్​లాల్ పాత్రకు హీరోయిన్​ లేదు. అందువల్ల రీమేక్​లోనూ హీరోయిన్​ లేకపోతే కమర్షియల్​గా వర్కౌట్​ కాదని సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే రీమేక్​లో సుజిత్​ హీరోయిన్​ పాత్రను సృష్టిస్తారా? లేక ఐటెం సాంగ్​తో సరిపెడతారా? అనేది చూడాలి.

ఇదీ చూడండి.. పేద దర్శకుల కుటుంబాలకు రజనీ​ సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.