ETV Bharat / sitara

మెగాస్టార్ యమజోరు.. యూత్​ఫుల్ డైరెక్టర్​తో కొత్త చిత్రం - వెంకీ కుడుముల లేటెస్ట్ మూవీ

Chiranjeevi Venky Kudumula: మెగాస్టార్ చిరంజీవి తన జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే నాలుగు చిత్రాల్లో నటిస్తున్న ఆయన.. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యువ డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

Chiranjeevi new movie,Megastar Chiranjeevi Venky Kudumula, చిరంజీవి వెంకీ కుడుముల, చిరంజీవి కొత్త సినిమా
Chiranjeevi news
author img

By

Published : Dec 14, 2021, 5:07 PM IST

Chiranjeevi Venky Kudumula: మెగాస్టార్ చిరంజీవి జోరు చూపిస్తున్నారు. కుర్ర హీరోలకు దీటుగా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నాలుగు సినిమాల్లో నటిస్తుండగా.. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'ఛలో', 'భీష్మ' లాంటి యూత్​ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది చిత్రబృందం.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 152వ చిత్రంగా 'ఆచార్య'లో నటిస్తోన్న చిరు.. తన 153వ సినిమాగా రానున్న లూసిఫర్‌ రీమేక్‌ 'గాడ్‌ ఫాదర్‌' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కొన్ని నెలల కిందట ప్రారంభమైంది. ఇక మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో 'భోళా శంకర్‌', బాబీ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా చిత్రీకరణ కూడా ఈ మధ్యే ప్రారంభమైంది.

ఇవీ చూడండి: Mahesh Babu surgery: సూపర్​స్టార్​ మహేశ్​కు సర్జరీ.. షూటింగ్​కు బ్రేక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.