చిత్ర పరిశ్రమకి చెందిన వివిధ విభాగాల ప్రతినిధులతో కలిసి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం కానున్నట్టు తెలిపారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన వై.ఎస్.జగన్‌తో ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. ఆ విషయాన్ని ట్వీట్ చేశారు చిరు.
-
అన్ని విభాగాల నుంచి ప్రతినిధులతో త్వరలోనే వారిని కలవటం జరుగుతుంది. Heartily thank Sri @ysjagan for issuing the GO for the single window system and agreeing to meet soon after the lockdown to discuss film industry issues.🙏🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">అన్ని విభాగాల నుంచి ప్రతినిధులతో త్వరలోనే వారిని కలవటం జరుగుతుంది. Heartily thank Sri @ysjagan for issuing the GO for the single window system and agreeing to meet soon after the lockdown to discuss film industry issues.🙏🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 24, 2020అన్ని విభాగాల నుంచి ప్రతినిధులతో త్వరలోనే వారిని కలవటం జరుగుతుంది. Heartily thank Sri @ysjagan for issuing the GO for the single window system and agreeing to meet soon after the lockdown to discuss film industry issues.🙏🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 24, 2020
"సినీ పరిశ్రమకు మేలు చేసే నిర్ణయాలతో పాటు సింగిల్ విండోలో చిత్రీకరణల అనుమతులకు జీవో విడుదల చేసినందుకు పరిశ్రమ తరఫున జగన్‌కు ఫోన్‌లో కృతజ్ఞతలు తెలిపాను. లాక్‌డౌన్ ముగిశాకా చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కలుద్దామని జగన్ చెప్పార"ని ట్వీట్‌లో పేర్కొన్నారు చిరంజీవి. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని చిత్ర పరిశ్రమ తరఫున చిరంజీవి, నాగార్జున తదితరుల బృందం కలిసింది.
ఇదీ చూడండి...పట్టాలెక్కనున్న సినిమాలు.. ఇక క్లాప్ కొట్టేద్దామా!