Chiranjeevi mother birthday: క్వారంటైన్‌లో ఉండటం వల్ల తన మాతృమూర్తి అంజనాదేవీని కలవలేకపోతున్నానని మెగాస్టార్ చిరంజీవి బాధపడ్డారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన.. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. తన తల్లి పుట్టినరోజు శనివారం పురస్కరించుకుని సోషల్‌మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లి, సతీమణితో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విటర్ వేదికగా షేర్ చేశారు.
-
అమ్మా !🌻💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌸
క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ 🙏
అభినందనలతో .... శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
">అమ్మా !🌻💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌸
క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ 🙏
అభినందనలతో .... శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3pఅమ్మా !🌻💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌸
క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ 🙏
అభినందనలతో .... శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
"అమ్మా.. నీకు జన్మదిన శుభాకాంక్షలు. క్వారంటైన్‌లో ఉన్న కారణంగా ప్రత్యక్షంగా కలుసుకొని నీ ఆశీస్సులు తీసుకోలేక ఇలా విషెస్ తెలుపుతున్నాను. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. ప్రేమతో.. శంకరబాబు" అని చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇందులో చిరు తన సొంతపేరు శివ శంకర వరప్రసాద్ (శంకరబాబు) ఉపయోగించడం వల్ల అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు. "అభిమానులందరికీ ఆయన మెగాస్టార్ లేదా చిరంజీవి కావొచ్చు. కానీ.. తన తల్లికి మాత్రం శంకరబాబునే కదా" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: