ETV Bharat / sitara

ఎన్టీఆర్​తో మాట్లాడిన చిరు.. ఏమన్నారంటే? - TOLLYWOOD HERO CORONA

కొవిడ్​ పాజిటివ్​గా తేలిన అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్​తో చిరు ఫోన్​లో మాట్లాడారు. ఆయన క్షేమసమాచారం అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

megastar chiranjeevi inquiries about jr.ntr health
ఎన్టీఆర్ - చిరంజీవి
author img

By

Published : May 12, 2021, 2:53 PM IST

Updated : May 12, 2021, 3:52 PM IST

ఇటీవల కరోనా బారినపడిన సినీ నటుడు ఎన్టీఆర్‌తో మెగాస్టార్‌ చిరంజీవి ఫోన్‌లో మాట్లాడారు. తారక్‌ ఆరోగ్యం గురించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని చిరునే స్వయంగా ట్విట్టర్​లో అభిమానులతో పంచుకున్నారు.

'కాసేపటి క్రితం తారక్‌తో ఫోన్‌లో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పారు. తారక్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు. తారక్‌ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలుసుకుని నాకెంతో ఆనందంగా అనిపించింది. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశిస్తున్నాను' -ట్విట్టర్‌లో చిరంజీవి

భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో కొమురం భీమ్‌గా తారక్‌ నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా చేయనున్నారు. మరోవైపు సినీ నటులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, కంగనా రనౌత్‌, శిల్పాశెట్టి కుటుంబం సహా పలువురు తారలు తాము కరోనా బారినపడినట్లు వెల్లడించారు. పవన్, బన్నీ ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నారు.

Last Updated : May 12, 2021, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.