ETV Bharat / sitara

మెగాస్టార్ 'మాస్'కు బాక్సాఫీస్ దిమ్మతిరిగింది!

పూర్తిస్థాయి మాస్, ఫ్యాక్షన్ కథతో రూపొందించిన 'ఇంద్ర' సినిమా వచ్చి 18 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలు, అద్భుతమైన డైలాగ్​లు మీకోసం.

మెగాస్టార్ 'మాస్'కు బాక్సాఫీస్ దిమ్మతిరిగింది!
ఇంద్ర సినిమాలో చిరంజీవి
author img

By

Published : Jul 24, 2020, 12:57 PM IST

Updated : Jul 24, 2020, 2:15 PM IST

'రావాలని కోరుకున్న మనిషి వచ్చినపుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేంటీ? రాననుకున్నారా? రాలేననుకున్నారా?' అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్‌.. ఏ అభిమాని మర్చిపోలేడోమో! ఇది బి.గోపాల్‌, చిరు కాంబినేషన్‌లో వచ్చిన 'ఇంద్ర' సినిమాలో. ఈ చిత్రం వచ్చి నేటికి 18 ఏళ్లు పూర్తయింది. అయినా ఇప్పటికీ సినిమా, అందులోని డైలాగులు ఓ సంచలనమే. ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తీసిన 'ఇంద్ర'.. చిరంజీవి కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచింది. ఇంద్రసేనా రెడ్డి,శంకర్‌ నారాయణగా రెండు పాత్రల్లోనూ అభిమానుల్ని అలరించారు చిరు.

ఈ సినిమాకు పరుచూరి సోదరుల మాటలు, మణిశర్మ సంగీతం అదనపు బలం. 'దాయి దాయి దామ్మా' పాటలో చిరు వేసిన స్టెప్పులు కుర్రకారును థియేటర్లలో కూర్చోనివ్వకుండా చేసిందంటే అతిశయోక్తి కాదేమో. వైజంతీ మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ దీనిని నిర్మించారు. వీరిద్దరి కలయికలో ఇది మూడో చిత్రం. యాక్షన్‌ సీన్స్‌ ఎంత అద్భుతంగా చిత్రీకరించారో కామెడీకి అంతే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ చిత్రంలో చిరు సరసన సోనాలి బింద్రే,ఆర్తి అగర్వాల్‌ ఆడిపాడి అభిమానుల్ని ఆకట్టుకున్నారు.

'ఇంద్ర' కొన్ని ఫేమస్ డైలాగ్​లు

  1. వీర శంకర్‌ రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా
  2. సింహాసనంపై కూర్చొనే హక్కు అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేనా రెడ్డిది
    megastar chiranjeevi indra cinema
    ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రాజసం
  3. కాశీకి వెళ్లాడు. కాషాయం ధరించాడు అనుకున్నారా? వారణాసి వెళ్లాడు. తన వరస మార్చుకున్నాడు అనుకున్నారా? అదే రక్తం.. అదే పౌరుషం. సై అంటే సెకనుకొక తల తీసుకెళ్తా.
  4. షౌకత్‌ అలీ ఖాన్‌, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలవంచుకుని పోతున్నాను. అదే నీ వైపు ఉంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. మా వాడు ఫోన్‌ చేసే దాక వచ్చాడంటే మీ అమ్మాయి ఎక్కడిదాకా వచ్చిందో నేను అడగను. పెళ్లి కావాల్సిన పిల్లని పది మందిలోకి పిలిచి పంచాయతీ పెట్టకు, తన మనసు తెలుసుకుని నిఖా పక్కా చేసుకో
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

'దాయిదాయి దామ్మా' కోసం చలిలో ఐదుగంటలు ప్రాక్టీసు

తెలుగు చిత్రసీమలో తనదైన డ్యాన్స్‌ మూమెంట్స్‌తో ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన ఘనత మెగాస్టార్‌ చిరంజీవి సొంతం. ఒకరకంగా చిరుని అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర చేసింది కూడా ఆయనలోని డ్యాన్స్‌ ప్రతిభే. అందుకే ఆయన చేసే చిత్రాల్లో పాటల విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తుంటారు దర్శక, నిర్మాతలు. మంచి స్టెప్పులకు అవకాశముండేలా ప్రత్యేకంగా స్వరాలు సిద్ధం చేస్తుంటారు సంగీత దర్శకులు. అయితే డ్యాన్స్‌ పరంగా చిరుకు బాగా పేరు తెచ్చిన పాటల్లో ఈ సినిమాలోని 'దాయి దాయి దామ్మా' ఒకటి. గతంలో మాట్లాడుతూ ఈ గీతానికి సంబంధించిన ఆసక్తికర విషయం వెల్లడించారు దర్శకుడు బి.గోపాల్.

chiru sonali bindre
'దాయిదాయి దామ్మా' పాటలో చిరు, సోనాలి బింద్రే

"దాయి దాయి దామ్మా పాటలో చిరంజీవి వేసిన వీణ స్టెప్పు ఎంత ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఆ పాటను స్విట్జర్లాండ్‌లో చిత్రీకరణ జరిపాం. ఆ స్టెప్పు షూట్‌ చేద్దామనుకున్న సమయానికి మంచు వర్షం కురవడం వల్ల చిత్రీకరణను ఆపేశాం. కానీ, చిరంజీవి మాత్రం డ్యాన్స్‌ మాస్టర్‌ లారెన్స్‌ను తన గదికి పిలిపించుకుని, దాదాపు ఐదు గంటల పాటు ప్రాక్టీసు చేశారు. అంతటి స్థాయికి ఎదిగిన మరో స్టార్‌ హీరో అయితే ఆ ఎముకలు కొరికే చలిలో బయట మంచంపై నుంచి కిందకు అడుగుపెట్టడానికే భయపడేవారు. కానీ, చిరు అలా చెయ్యలేదు. నటన పట్ల తనకు ఎంతటి అంకిత భావం ఉంటుందో చెప్పడానికి ఇది మచ్చుతునక" అని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు బి.గోపాల్.

Last Updated : Jul 24, 2020, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.