ETV Bharat / sitara

స‌వాళ్ల‌ను అధిగ‌మించి ఎదిగిన న‌టుడు వీరయ్య: చిరంజీవి - movie news

నటుటు వీరయ్య మృతిపట్ల సంతాపం తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. నటుడిగా ఆయన ఎన్నో సవాళ్లు అధిగమించారని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

chiranjeevi potti veeraiah
చిరంజీవి వీరయ్య
author img

By

Published : Apr 26, 2021, 10:26 AM IST

దాదాపు 300 కి పైగా తెలుగు సినిమాల్లో కీలకమైన అతిథి పాత్రలను పోషించిన‌ ప్రముఖ తెలుగు నటుడు పొట్టి వీరయ్య.. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గుండె సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆయ‌న‌ దురదృష్టవశాత్తు ఆదివారం (25 ఏప్రిల్) సాయంత్రం కన్నుమూశారు. కుటుంబ సభ్యుల వివ‌రాల ప్ర‌కారం అంత్యక్రియలు సోమవారం జరుగుతాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఫానిగిరి గ్రామానికి చెందిన గట్టు వీరయ్య చిన్నప్పటి నుంచీ రంగస్థల క‌ళాకారుడు. సినీరంగంలో ద‌శాబ్ధాల పాటు ఆయ‌న సేవ‌లందించారు.

ప‌రిశ్ర‌మ‌కు సుదీర్ఘ కాలం సేవ‌లందించిన వీర‌య్య మృతి ప‌ట్ల సానుభూతిని వ్య‌క్త‌ప‌రుస్తూ.. మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియ‌జేశారు. "వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో సవాళ్లను అధిగమించి, మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి, తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీ పొట్టి వీరయ్య గారి మృతి ఎంతో కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. ఆయ‌న‌ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకొంటున్నాను" అని చిరు అన్నారు.

సినిమా వాళ్లే లేకపోతే తాను ఎప్పుడో చనిపోయే వాడిన‌ని, చిరంజీవి స్థాపించిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ వల్లే ఈరోజు బతుకుతున్నా అని గతంలో ఓ ఇంట‌ర్వ్యూలో పొట్టి వీరయ్య చెప్పారు. సినిమాల్లో నటిస్తేనే డబ్బులు వస్తాయి. తరువాత ఉండవు. ఈ మధ్య నేను అనారోగ్యంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి.. రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారని అదే ఇంటర్వ్యూలో వీరయ్య తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.