ETV Bharat / sitara

రాములోరి పండక్కి 'ఆచార్య' ఫస్ట్​లుక్! - రాములోరి పండక్కి 'ఆచార్య' ఫస్ట్​లుక్!

చిరు కొత్త సినిమా ఫస్ట్​లుక్​ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హీరోయిన్​గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

రాములోరి పండక్కి 'ఆచార్య' ఫస్ట్​లుక్!
మెగాస్టార్ చిరంజీవి
author img

By

Published : Mar 30, 2020, 4:21 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. వచ్చే నెల 2న శ్రీరామనవమి సందర్భంగా అభిమానులతో పంచుకోనుందని సమాచారం.

ఫస్ట్​లుక్​ను తొలుత ఉగాదికే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అదే రోజు చిరు ట్విట్టర్​లోకి ఎంట్రీ ఇవ్వడం, 'ఆర్ఆర్ఆర్' మోషన్​ పోస్టర్ విడుదల కావడం వల్ల తన ఆలోచనను చిరు మార్చుకున్నారట. బదులుగా రామనవమికి తీసుకురావాలని భావించారు.

MEGASTAR CHIRANJEEVI
మెగాస్టార్ చిరంజీవి

కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే నిలిచిపోయింది. దీని ప్రభావం చిత్ర విడుదలపైనా పడే అవకాశముంది. మరి ముందుగా అనుకున్నట్లు ఆగస్టులో వస్తుందా? ముందుకు జరుగుతుందా అనేది చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.