ETV Bharat / sitara

సూపర్​స్టార్ కోసం మెగాస్టార్.. అభిమానులకు పండగే - మెగాస్టార్ చిరంజీవి

సూపర్​స్టార్ మహేశ్​బాబు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక జనవరి 5న జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.

megastar
చిరంజీవి
author img

By

Published : Dec 20, 2019, 6:08 PM IST

Updated : Dec 20, 2019, 7:31 PM IST

సూపర్‌స్టార్‌ మహేశ్ కోసం మెగాస్టార్‌ చిరంజీవి రాబోతున్నాడు. ఎందుకంటే? దర్శకుడు అనిల్‌ రావిపూడి మహేశ్​తో తెరకెక్కిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా ముందస్తు విడుదల కార్యక్రమానికి చిరు ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది చిత్రబృందం.

megastar
చిరంజీవి, అనిల్ రావిపూడి
megastar
చిరంజీవితో అనిల్, దిల్​రాజు, అనిల్ సుంకర

దర్శకుడు అనిల్​ రావిపూడితో పాటు నిర్మాతలు దిల్​రాజు, అనిల్ సుంకర స్వయంగా చిరంజీవిని ప్రీరిలీజ్ వేడుకకు రావల్సిందిగా ఆహ్వానించారు. చిరు కూడా రావడానికి వెంటనే అంగీకరించాడట. ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మహేశ్ ఓ సందేశాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.

megastar
మహేశ్ సందేశం

"మా ఆహ్వానాన్ని మన్నించి ప్రీరిలీజ్ వేడుకకు హాజరవబోతున్న చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఈ వేడుకలో మీరూ పాల్గొనడం సంతోషంగా ఉంది. మీ రాకతో మా ఆనందం రెట్టింపవుతుంది. ఈ వేడుక కోసం ఎదురుచూస్తున్నా."
-మహేశ్ బాబు, సినీ నటుడు

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జనవరి 5న ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మహేశ్ కోసం చిరు వస్తుండడం వల్ల సినీ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇవీ చూడండి.. రణ్‌బీర్‌ - శ్రద్ధల చిత్రం వచ్చేది అప్పుడే

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Dec 20, 2019, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.