ETV Bharat / sitara

'మెగా'ఫ్యామిలీలో​ ఘనంగా రక్షాబంధన్​ వేడుకలు - chiranjeevi pawankalyan celebrates rakhi

'మెగా'ఫ్యామిలీలో చిరంజీవి పుట్టినరోజు, రక్షా బంధన్​ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మెగాబ్రదర్స్​ చిరంజీవి, నాగబాబు, పవన్​కల్యాణ్ కలిసి​ సందడి చేయడం చూడ ముచ్చటగా ఉంది. ఆ వీడియోను మీరు చూసేయండి..

chiranjeevi
చిరు
author img

By

Published : Aug 22, 2021, 8:46 PM IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు, రాఖీ పౌర్ణమి.. ఈసారి ఒకేరోజు వచ్చాయి. ఈ సందర్భంగా మెగాఫ్యామిలీలో పండగ వాతవరణం నెలకొంది. మెగాబ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్​కల్యాణ్​​ ఒక చోట చేరి సందడి చేశారు. ఈ రెండు వేడుకల్ని తమ సోదరిమణులతో కలిసి మిఠాయిలు తినిపించుకుంటూ ఘనంగా జరుపుకున్నారు. తన సోదరిమణులు చూపించిన ప్రేమకు ముగ్గురు అన్నదమ్ములు మురిసిపోయారు. కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు.

చిరంజీవి నివాసానికి చేరుకున్న పవన్ కల్యాణ్​ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు నివాసానికి చేరుకుని కేరింతలు కొట్టారు. ఫ్యాన్స్​ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు పవన్ కల్యాణ్, చిరంజీవి బయటకు వచ్చి కాసేపు అభిమానులను పలకరించి వెళ్లారు.

ఇదీ చూడండి: చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేశ్.. స్పెషల్ వీడియో రిలీజ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.