ETV Bharat / sitara

'వకీల్​సాబ్​'పై మెగా హీరోల ప్రశంసలు

పవన్​ కల్యాణ్​ నటించిన 'వకీల్​సాబ్​' చిత్రంపై మెగా హీరోలు ప్రశంసలు కురిపించారు. ఇందులో పవన్ నటన అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. మూడేళ్ల తర్వాత మళ్లీ పవన్​ అదే వేడి, వాడి, పవర్​తో తిరిగి వచ్చాడని మెగాస్టార్​ చిరంజీవి ట్వీట్​ చేశారు.

mega heros reactions on Vakeel Saab movie
'వకీల్​సాబ్​'పై మెగా హీరోల ప్రశంసలు
author img

By

Published : Apr 10, 2021, 11:39 AM IST

మూడేళ్ల తర్వాత మళ్లీ పవన్‌కల్యాణ్‌ అదే వేడి, వాడి, పవర్‌తో కమ్‌బ్యాక్‌ ఇచ్చాడని అన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. శుక్రవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి 'వకీల్‌సాబ్‌' చిత్రాన్ని వీక్షించిన చిరు.. చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మరోవైపు నాగబాబు, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, సుస్మిత సైతం సోషల్‌మీడియా వేదికగా పవన్​ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు.

"మూడేళ్ల తర్వాత మళ్లీ పవన్‌కల్యాణ్‌ అదే వేడి, వాడి, పవర్‌తో వచ్చాడు. ప్రకాశ్‌రాజ్‌తో కోర్టు రూమ్‌ డ్రామా అద్భుతం! నివేదా థామస్‌, అంజలి, అనన్య వాళ్ల పాత్రల్లో జీవించారు. సంగీతంతో తమన్‌, కెమెరా పనితనంతో వినోద్‌ సినిమాకు ప్రాణం పోశారు. దిల్‌రాజు, బోనీకపూర్‌, వేణుశ్రీరామ్‌తోపాటు మిగతా టీమ్‌కు నా శుభాకాంక్షలు. అన్నింటినీ మించి మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యద్భుతమైన చిత్రమిది. ఈ వకీల్‌సాబ్ కేసుల్నే కాదు అందరి మనసుల్నీ గెలుస్తాడు!"

- చిరంజీవి, కథానాయకుడు

  • A longing of 3 years fulfilled with the feast of a life time
    People asked of to write a review and i said NO..
    A movie which pushed the boundaries to pull everyones attention to address A CRITICAL issue which many of us pretend never exist.
    Its ok to be You
    And a No means No.. pic.twitter.com/eVfyD4p7BX

    — Naga Babu Konidela (@NagaBabuOffl) April 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మూడేళ్ల ఆకలికి 'వకీల్‌సాబ్‌'తో జీవితకాలానికి సరిపడా విందు అందించాడు. ఈ సినిమాకు రివ్యూ రాయమని చాలామంది నన్ను అడిగారు. కానీ, నేను నో అని చెప్పాను. ప్రస్తుతం ఎదురవుతున్న ఓ క్లిష్టమైన సమస్యతో వచ్చిన ఈ సినిమా సమాజంలో ఉన్న ప్రతిఒక్కర్నీ ఆకర్షించింది."

- నాగబాబు, నటుడు, నిర్మాత

"అబ్జక్షన్‌!! అబ్జక్షన్‌!! అబ్జక్షన్‌!! వాట్‌ ఏ పవర్‌ప్యాక్డ్‌ పెర్ఫామెన్స్‌. కల్యాణ్‌ మామ నటన అద్భుతంగా ఉంది. సరైన సమయంలో వచ్చిన సరైన సినిమాలో సరైన వ్యక్తి నటించారు. బ్లాక్‌బస్టర్‌ వకీల్‌సాబ్‌"

- సాయిధరమ్‌ తేజ్‌, కథానాయకుడు

  • Power packed performance from Babai!✊🏽
    Loved #VakeelSaab!
    And really impressive performances by all the three leading ladies..🙌🏽

    Adapted and executed very well by Venu sriram garu..👏🏽
    And @MusicThaman you nailed it brother!!!
    Top notch score!

    Justice is served!🔥🔥🔥

    — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) April 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"బాబాయ్‌ నటన పవర్‌ప్యాక్డ్‌గా ఉంది. 'వకీల్‌సాబ్‌' నాకెంతో నచ్చింది. నివేదా, అంజలి, అనన్యల నటన ప్రతిఒక్కర్నీ ఆకట్టుకునేలా సాగింది. తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యేలా వేణుశ్రీరామ్‌ ఈ రీమేక్‌ను తీర్చిదిద్దారు. తమన్‌ మ్యూజిక్‌ అదిరిపోయింది. సరైన న్యాయం జరిగింది".

- వరుణ్‌ తేజ్‌, కథానాయకుడు

"వకీల్‌సాబ్‌' టీమ్‌ మొత్తానికి కంగ్రాట్స్‌. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా ఇంకా తక్కువగానే ఉంటుంది. కమర్షియల్‌, ఎంటర్‌టైనింగ్‌, పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు".

-సుస్మిత, డిజైనర్, చిరు కుమార్తె

వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన 'వకీల్‌సాబ్‌'లో పవన్‌ సత్యదేవ్‌ పాత్రలో లాయర్‌గా కనిపించారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో శ్రుతిహాసన్‌ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించారు. అంజలి, అనన్య, నివేదా థామస్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'వకీల్​సాబ్​' చిత్రాన్ని వీక్షించిన మెగా ఫ్యామిలీ

క్యాష్​ షోలో 'వకీల్​సాబ్​' టీమ్​ సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.