ETV Bharat / sitara

కరోనా జాగ్రత్తలపై ప్రజలకు మెగా ఫ్యామిలీ సందేశం - covid news

లాక్​డౌన్ సమయంలో ఇంట్లో ఉండి, కరోనాను తరిమికొట్టాలని చెప్పింది మెగా కుటుంబం. ఈ విషయాన్నే చెబుతూ ఓ ఫొటోను పోస్టు చేశారు.

కరోనా జాగ్రత్తలపై ప్రజలకు మెగా ఫ్యామిలీ సందేశం
మెగా కుటుంబం
author img

By

Published : Apr 15, 2020, 12:05 PM IST

భారత్​లో లాక్​డౌన్​ను మే 3వరకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మెగాకుటుంబం సందేశంతో కూడిన ఓ ఫొటోను పంచుకుంది. ఇందులో భాగంగా మెగా ఫ్యామిలీలోని కొందరు సభ్యులు బోర్డులు పట్టుకుని కరోనా విషయంలో ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. ఇప్పుడిది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

"ఇంట్లో ఉంటాం.. యుద్ధం చేస్తాం.. క్రిమిని కాదు ప్రేమను పంచుతాం.. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం.. భారతీయులం ఒక్కటై భారత్​ను గెలిపిస్తాం. #STAY HOME #STAY SAFE " అని ఈ ఫొటోలో ఉంది.

mega family photo
కరోనా జాగ్రత్తలపై మెగా కుటుంబం సందేశం

ప్రస్తుతం చిత్ర షూటింగ్​లు, ఇతరత్రా కార్యక్రమాలు నిలిచిపోవడం వల్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ పలు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసి అలరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.