ETV Bharat / sitara

అరె.. అచ్చుగుద్దినట్టు ఐశ్వర్యరాయ్‌లానే ఉందే! - ఐశ్వర్యను పోలిన ఆశ్రిత

సినిమాల్లోనే కథానాయకులకు డూప్స్​ చూస్తాం. నిజ జీవితంలో చాలా అరుదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్​ ఐశ్వర్యరాయ్ పోలికలతో మరో అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తోంది. అచ్చం ఐశ్వర్య పోలికలతో ఉంటూ, నెటిజన్లను అలరిస్తోంది.

aashriha
ఆశ్రిత
author img

By

Published : Aug 4, 2021, 2:49 PM IST

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఇలాంటి సన్నివేశాలను ఎక్కువ మనం చిత్రసీమలో చూడొచ్చు. ఎందుకంటే అక్కడ హీరోహీరోయిన్లకు డూప్స్‌ ఉంటారు కాబట్టి. ఇక ఆ డూప్స్‌కు ఉండే క్రేజ్‌ మాములుగా ఉండదు. ఇప్పుడు ఐశ్వర్యారాయ్‌ డూప్‌ అశ్రిత రాథోడ్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. అచ్చు గుద్దినట్టు ఐష్‌లా ఉండటమే కాదు.. ఐష్‌ నటించిన చిత్రాల్లో చెప్పిన డైలాగ్స్ చెప్పేస్తుంది. పాటలు పాడేస్తుంది. దీంతో ఫాలోవర్స్‌ సైతం ఆమెకు ఫిదా అవుతున్నారు.

ఐష్‌ అంత అందంగా ఉన్నవని ఒకరంటే.. బాలీవుడ్‌,టాలీవుడ్‌లో ఎందుకు ప్రయత్నించకూడదంటూ మరొకరు సలహాలస్తున్నారు. కేవలం ఆశ్రిత మాత్రమే కాదు. గతంలోనూ ఐశ్వర్య రాయ్‌లా పోలిన వారు.. చిత్రసీమలో రాణించారు. అందులో బాలీవుడ్‌ నటి స్నేహా ఉల్లాల్‌, మరాఠీ నటి మాన్సి నాయక్‌తో పాటు పాకిస్థానీ వైద్యురాలు అమ్నా ఇమ్రాన్‌లు ఐష్‌ డూప్‌గా పేరొందారు. ఇంకెందుకాలస్యం.. ఐశ్వర్యారాయ్‌ను పోలిన అశ్రిత, స్నేహా ఉల్లాల్‌, మానసి నాయక్, అమ్నా ఇమ్రాన్‌ చిత్రాలను మీరూ చూసేయండి.

sneha ullal
స్నేహా ఉల్లాల్​
manasi nayak
మానసి నాయక్​
amna imran
అమ్నా ఇమ్రాన్

ఇదీ చదవండి:బాలీవుడ్​లోకి మరో తెలుగు దర్శకుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.