ETV Bharat / sitara

'ఎఫ్ 3' చిత్రంలో మాస్ మహారాజా..! - అనిల్​ రావిపూడి కొత్త సినిమా

అనిల్​ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న 'ఎఫ్​ 3' సినిమా పోస్టర్​ను​ ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. కాగా ఈ సినిమాలో రవితేజ గెస్ట్​ రోల్​లో కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Mass raja ravi Teja to appear as a guest in F3 movie
వెంకీ సినిమాలో 'మాస్​ రాజా'..!
author img

By

Published : Dec 14, 2020, 3:34 PM IST

విక్టరీ వెంకటేష్​, వరుణ్ తేజ్ జంటగా నటిస్తోన్న 'ఎఫ్​ 3' సినిమా పోస్టర్ ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. వరుస హిట్​ చిత్రాలతో దూసుకెళ్తోన్న డైరెక్టర్​ అనిల్​ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మాస్​ మహారాజా రవితేజ గెస్ట్​ రోల్​ పోషించనున్నట్లు టాలీవుడ్​ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

వెంకీ 60వ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన 'ఎఫ్​3' కాన్సెప్ట్ పోస్టర్ సినీ ప్రేమికుల్లో ఆసక్తి రేపుతోంది. డబ్బులతో నిండిన ట్రాలీని నెట్టుకెళ్తోన్న వెంకీ, వరుణ్​ లుక్​లు భిన్నంగా ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా డబ్బుల చుట్టూ తిరిగే కామెడీ కథాంశం అని అర్థమవుతోంది. అయితే ఈ ఇద్దరు హీరోలను ఇరకాటంలో పెట్టే పాత్ర రవితేజ పోషించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వెంకీ 'నారప్ప' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్​ స్పోర్ట్స్ స్టోరీతో రూపొందుతోన్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయ్యాక ఇద్దరు నటులు 'ఎఫ్ 3' షూటింగ్​లో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి:గోవా షికారుకు బాలీవుడ్​ లవ్ బర్డ్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.