ETV Bharat / sitara

'క్రాక్'.. ప్రేక్షకులకు ఫుల్​మీల్స్: రవితేజ - raviteja news

తన కొత్త సినిమా విడుదల సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు హీరో రవితేజ. 'క్రాక్' అందరికీ నచ్చుతుందని, కానీ థియేటర్లలో కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

mass maharaja raviteja about 'krack' cinema
హీరో రవితేజ
author img

By

Published : Jan 6, 2021, 7:33 AM IST

Updated : Jan 6, 2021, 8:51 AM IST

మాస్‌ అనే మాటకు పర్యాయపదంలా కనిపిస్తుంటారు... రవితేజ. ఇక ఆయన పోలీస్‌ పాత్రతో చేసిన సినిమా అంటే ఆ లెక్క మరోలా ఉంటుంది. అంచనాలు పెరిగిపోతుంటాయి. రవితేజ మరోసారి పోలీసుగా నటించిన 'క్రాక్‌' ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో మంగళవారం ముచ్చటించారు. ఆ విషయాలివీ...

నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సంక్రాంతికి పోటీ గట్టిగానే ఉంది కదా...

ఉండాలి, ఇలా ఎన్నోసార్లు జరిగింది. బాగున్నాయంటే సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ బాగా ఆడతాయి. నాలుగు కాదు, ఐదు సినిమాలు ఆడిన రోజులు కూడా ఉన్నాయి. పండగ ప్రత్యేకత కూడా అదే. ఈ సినిమా చూశాను కాబట్టి, ఇది చూడననే పరిస్థితి ఉండదు. పండగంటే అన్ని సినిమాలూ చూసేస్తారు. పండగ సీజన్‌లో ప్రేక్షకుల ఉత్సాహం వేరుగా ఉంటుంది. మిగతా సమయాల్లో సినిమాలు విడుదల కావడానికి, పండగ సందర్భంలో ప్రేక్షకుల ముందుకొచ్చే సినిమాలకూ చిన్న తేడా ఉంటుంది. నేను కూడా అలా సినిమాలు చూసి వచ్చినవాణ్నే.

raviteja 'krack' cinema
క్రాక్ సినిమాలో రవితేజ

కొవిడ్‌ జాగ్రత్తల వల్ల యాభై శాతం ప్రేక్షకులతోనే ప్రదర్శనలు నిర్వహించాల్సి ఉంటుంది. తమిళనాడులో వంద శాతం ప్రేక్షకుల్ని అనుమతించారు. మీవైపు నుంచి ఆ ప్రయత్నాలేమైనా చేస్తున్నారా?

మనకూ వంద శాతం అనుమతులు వస్తే బాగుంటుంది. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. యాభై శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు నిర్వహించినా సినిమా ఫలితం బాగుంటుందని నా నమ్మకం. ఆ విషయంలో నాకైతే ఎలాంటి భయాలు లేవు. థియేటర్లో సినిమా చూసేవాళ్లను నేను కోరుకునేది ఒక్కటే. దయచేసి మాస్క్‌లు, చిన్నసైజ్‌ శానిటైజర్లు చేతిలో పెట్టుకుని వెళితే చాలా బాగుంటుంది. చాలా సురక్షితంగా ఉంటాం. అభిమానులంటే ఇక అరుపులు ఉంటాయి కదా, వాళ్లని మాస్క్‌లు వేసుకునే అరవండని చెబుతున్నాం.

'క్రాక్‌' ఎలా ఉండబోతోంది?

పక్కా వాణిజ్య చిత్రం. మాసీగా, ఫుల్‌ మీల్స్‌లా ఉంటుందనుకోండి. ప్రేక్షకులు సంతోషంగా చూస్తారు. వాళ్లకు కచ్చితంగా నచ్చుతుంది. సినిమా చాలా బాగొచ్చింది. నా పాత్రను కూడా చాలా బాగా ఆస్వాదించా. గోపీచంద్‌ మలినేనికీ, నాకూ బాగా సెట్‌ అయింది. అలా అని మేం ముందుగా అనుకుని ఈ సినిమా చేయలేదు. అలా కుదిరిందంతే. హ్యాట్రిక్‌ కొడతామని మేం నమ్ముతున్నాం. నా సినిమాలకు ఎలాంటి సంగీతం ఇవ్వాలో తమన్‌కు బాగా తెలుసు. తనకు నేనే కాదు, ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. సముద్రఖని నేను బాగా ఇష్టపడే అతి కొద్దిమంది వ్యక్తుల్లో ఒకరు. ఇదివరకు తన దర్శకత్వంలో పని చేయడాన్ని ఎంతగా ఆస్వాదించానో, తనతో కలిసి ఈ సినిమాలో నటించడాన్నీ ఆస్వాదించాను. శ్రుతి హాసన్‌ పాత్ర చాలా బాగుంటుంది.

raviteja 'krack' cinema
క్రాక్ సినిమాలో రవితేజ

పోలీస్‌ పాత్రల్లో ఒదిగిపోతుంటారు. పోలీసులు ఎవరైనా ఆ విషయంలో కితాబునిస్తుంటారా?

విక్రమ్‌ సింగ్‌ రాఠోడ్‌ పాత్ర చలవే అంతా. ఆ క్రెడిట్‌ అంతా దర్శకుడు రాజమౌళికే వెళుతుంది. అప్పుడప్పుడు ఎక్కడైనా వేడుకల్లో కలిసినప్పుడు కూడా పోలీస్‌ మిత్రులు 'విక్రమార్కుడు'ను గుర్తు చేస్తుంటారు. మాకు నచ్చిన పాత్ర అని చెబుతుంటారు. 'క్రాక్‌' తర్వాత కూడా అలాంటి ప్రశంసలు రావొచ్చు. సినిమా బాగుంటే అన్నీ బాగుంటాయి. అయితే 'విక్రమార్కుడు'ని, మిగతా సినిమాలతో పోల్చి చూడకూడదు. ఇది నిజ జీవితంలోని సంఘటనల స్ఫూరితో అల్లిన కథ ఇది. కథానాయకుడి పాత్రకు కూడా స్ఫూర్తి ఉంది.

లాక్‌డౌన్‌ సమయం ఎలా గడిచింది?

అద్భుతంగా గడిచింది. జిమ్‌లో కసరత్తులు చేసుకున్నాను. బోలెడు సినిమాలు చూశాను. మనం అనుకుంటాం కానీ, చూడటానికి బోలెడంత ఉంది. బయట ఎక్కువ తిరిగేవాళ్లు సమస్యలు ఎదుర్కున్నారు కానీ, నాకేం సమస్య ఎదురు కాలేదు. నేను ఫ్యామిలీ మేన్‌. బయట ఎక్కువగా తిరగను. దాంతో లాక్‌డౌన్‌లోనూ సంతోషంగా కుటుంబ జీవితాన్ని ఆస్వాదించా. ఒక్క క్షణం కూడా బోర్‌ ఫీల్‌ కాలేదు. ఎన్నితెలిశాయి, ఎన్ని చూశాను.

raviteja 'krack' cinema
క్రాక్ సినిమాలో రవితేజ

"మా అబ్బాయి మహాధన్‌ స్కూల్‌కి వెళుతున్నాడు. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తను సినిమాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి వల్ల ‘రాజా ది గ్రేట్‌’లో ఓ చిన్న పాత్ర చేశాడు. ఇప్పట్లో మాత్రం సినిమా ఆలోచన లేదు. వాళ్లకి ఏం చేయాలో చాలా బాగా తెలుసు. ఏది ఇష్టమైతే అది చెయ్యి అని చెబుతుంటాను. నా సినిమాల విషయంలో మాత్రం సలహాలు ఇస్తూనే ఉంటారు. ఉచితమే కదా... సలహా ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉంటారు (నవ్వుతూ). సినిమాల విషయంలో మాత్రం నేనేం చేసినా మా పిల్లలకు బాగానే ఉంటుంది. అయితే వాళ్ల నుంచి కూడా నేర్చుకోవల్సినవి చాలా ఉంటాయి. అప్పుడప్పుడు మా పిల్లల నుంచి కూడా తెలుసుకుంటాను కానీ, తెలుసుకున్నట్టు కనిపించకుండా జాగ్రత్తపడతా (నవ్వుతూ). మా అబ్బాయి సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటాడు. ఈ తరం అంతా అలాగే ఉంటుంది".

కొత్తగా చేస్తున్న సినిమాల విశేషాలేమిటి?

ప్రస్తుతానికి 'ఖిలాడి' చిత్రీకరణలో ఉన్నా. ఇంకా కొన్ని సినిమాల పనులు జరుగుతున్నాయి. ఇలాంటి సినిమాలే చేయాలనే లెక్కలేమీ లేవు. మంచి కథలొస్తే ప్రయోగాత్మక చిత్రాలైనా సరే, కచ్చితంగా చేస్తాను.

ఇది చదవండి: సంక్రాంతికి హీరోలు సై.. బరిలో నాలుగు సినిమాలు

Last Updated : Jan 6, 2021, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.