ETV Bharat / sitara

విజయ్ దేవరకొండ తర్వాతి చిత్రం ఆ దర్శకుడితో! - విజయ్​ దేవరకొండ

వినోదాత్మక చిత్రాలనే ఎక్కువగా తీసే దర్శకుడు మారుతి.. త్వరలో యువహీరో విజయ్​ దేవరకొండతో కలిసి పనిచేయనున్నాడట. ఈ విషయమే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.​

maruthi will direct vijay devarakonda with fully entertained story?
విజయ్ కొత్త సినిమాలో హాస్యంతో పాటు సందేశం!
author img

By

Published : Feb 23, 2020, 5:10 PM IST

Updated : Mar 2, 2020, 7:41 AM IST

ఇటీవల కాలంలో వరుస అపజయాలతో సతమతమైన దర్శకుడు మారుతి.. గతేడాది చివర్లో వచ్చిన 'ప్రతిరోజూ పండగే'తో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు. సాయి తేజ్​, రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రం.. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను అలరించింది. బాక్సాఫీస్​ వద్ద రూ.40 కోట్ల పైగా కలెక్షన్లు సాధించింది.

వినోదాన్ని మేళవించి, సందేశాత్మక చిత్రాలను తీసే దర్శకుడు మారుతి అలాంటి మరో కథను ఇప్పుడు సిద్ధం చేశాడట. ఇందులో విజయ్ దేవరకొండ​ హీరో అని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

విజయ్ చెప్పినట్లే చేస్తున్నాడా?

విజయ్​ దేవరకొండ.. ఇటీవలే జరిగిన 'వరల్డ్​ ఫేమస్ లవర్​' ప్రీరిలీజ్​ వేడుకలో మాట్లాడుతూ ఇకపై ప్రేమ కథా చిత్రాల్లో నటించనని, ఇదే తన లవ్​స్టోరీ అని అన్నాడు. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి పేరు తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి.. 'రైళ్లలో పాటలు పాడుతూ డబ్బు సంపాదించేవాడిని'

Last Updated : Mar 2, 2020, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.