ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజు సప్టే ఆత్మహత్మ చేసుకున్నారు. లేబర్ యూనియన్‌లోని ఓ అధికారి వేధింపులే తను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమని చెబుతూ తనువు చాలించారు.
ఇంతకీ ఏం జరిగింది?
గతేడాది మార్చిలో లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి అన్ని రంగాల్లానే సినీ పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. థియేటర్లు మూతబడటం, షూటింగ్‌లు లేకపోవడం వల్ల చాలామంది సినీ కార్మికులు ఇబ్బందిపడ్డారు. కొంతమంది కరోనాతోనూ మరణించారు. అయితే ఇవేవి కాకుండా లేబర్ యూనియన్ అధికారి వేధింపులు తట్టుకోలేకపోతున్నాననంటూ వీడియో తీసి, ఆత్మహత్య చేసుకున్నారు.
-
We request @MumbaiPolice and @CMOMaharashtra @AnilDeshmukhNCP proper inquiry for our Art Director Raju Sapte. We want all culprits behind bars.#CBI#RajuSapte pic.twitter.com/jhGVIktoGw
— All Indian Cine Workers Association (@AICWAofficial) July 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">We request @MumbaiPolice and @CMOMaharashtra @AnilDeshmukhNCP proper inquiry for our Art Director Raju Sapte. We want all culprits behind bars.#CBI#RajuSapte pic.twitter.com/jhGVIktoGw
— All Indian Cine Workers Association (@AICWAofficial) July 4, 2021We request @MumbaiPolice and @CMOMaharashtra @AnilDeshmukhNCP proper inquiry for our Art Director Raju Sapte. We want all culprits behind bars.#CBI#RajuSapte pic.twitter.com/jhGVIktoGw
— All Indian Cine Workers Association (@AICWAofficial) July 4, 2021
లేబర్ యూనియన్ అధికారి రాకేశ్ మౌర్య.. యూనియన్‌కు తాను డబ్బులు కట్టట్లేదని వర్కర్స్ అందరికీ ఫోన్ చెబుతుండేవారని, తాను విధిగా కడుతున్నప్పటికీ ఇలా చెప్పడం చాలా బాధించిందని రాజు చెప్పారు. తన చేతిలో ఐదు ప్రాజెక్టులు ఉన్నాయని.. అతడి వేధింపుల వల్ల అందులోని ఓ పెద్ద సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని ఆ వీడియోలో రాజు వెల్లడించారు.
మహారాష్ట్ర నవనిర్మాణ ఛత్రపతి సేన అధ్యక్షుడు అమేయా కోప్కర్.. రాజు మరణంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటవ్యక్తులు సినిమా చేస్తున్న వాళ్ల ఇబ్బందిపెట్టడం, వేధించడం లాంటివి చేస్తే ఉరుకునేది లేదని స్పష్టం చేశారు. తక్షణమే దీని గురించి ముఖ్యమంత్రి, హోం మినిస్టర్‌కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: