ETV Bharat / sitara

మూడుసార్లు తిరస్కరణ.. మనోజ్ ఆత్మహత్యాయత్నం​ - మనోజ్ బాజ్​పేయీ ద ఫ్యామిలీ మ్యాన్

సినీ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పిన ప్రముఖ నటుడు మనోజ్ బాజ్​పేయీ.. గతంలో ఆత్మహత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు. అందుకు గల కారణాల్ని తెలిపారు. అలానే బాలీవుడ్​లోని రాజకీయాలు గురించి మాట్లాడారు.

Manoj Bajpayee
మనోజ్ బాజ్​​పేయీ
author img

By

Published : Jul 2, 2020, 5:38 PM IST

రెండు జాతీయ అవార్డులు, పద్మశ్రీ బిరుదు, విలక్షణ నటుడుగా స్టార్​ హోదా, అభిమానుల్లో ఫుల్​ క్రేజ్​ ఇదంతా మనోజ్ బాజ్​​పేయీ సొంతం. అయితే ఇవన్నీ సంపాదించే క్రమంలో ఈ నటుడు ఓ మినీ యుద్ధమే చేశారట. అయితే ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలోని ఎన్నో అటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని చెప్పారు​. గతంలో ఓ సందర్భంలో ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వూలో వెల్లడించారు​.

తొమిదేళ్లు ఉన్నప్పుడే నటనపై ఆసక్తి

బిహార్​లో పుట్టిపెరిగిన మనోజ్​కు తొమ్మిదేళ్ల ఉన్నప్పుడే గొప్ప నటుడి కావాలని కలలు కన్నారు. బాలీవుడ్​పై మక్కువతో కొన్నాళ్ల తర్వాత ముంబయి చేరుకున్నారు. అక్కడ నెగ్గుకురావాలంటే చాలా భాషలు తెలుసుండాలని, దీనితోపాటే ప్రఖ్యాత నేషనల్​ స్కూల్ ఆఫ్​ డ్రామా ఇన్​స్టిట్యూట్​లో చేరాలని భావించారు. కానీ అందులో చేరేందుకు కొన్ని ప్రత్యేకమైన నైపుణ్య అర్హతలు ఉండాలని తెలుసుకున్నారు.

దీంతో నిరంతరంగా కృషి చేసి, పట్టుదలతో తనకు వచ్చిరానీ ఆంగ్ల, హిందీ భాషలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించారు మనోజ్. ఎట్టకేలకు నేషనల్​ స్కూల్​ ఆఫ్​ డ్రామాకు దరఖాస్తు చేశారు. కానీ ఊహించని రీతిలో తిరస్కరణకు గురయ్యారు. ఇలా వరుసగా మూడుసార్లు జరిగింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నం చేశారు. అదృష్టవశాత్తు అదే సమయంలో మిత్రులు అతడిని రక్షించినట్లు వెల్లడించారు.

భయపడి ఎదగనివ్వరు

Manoj Bajpayee
మనోజ్ బాజ్​​పేయీ..

ప్రతిభావంతులను సినీ పరిశ్రమ నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు మనోజ్. దీనిపై ఇండస్ట్రీ ఓసారి బాగా ఆలోచించాలని అన్నారు.

"ఎటువంటి నేపథ్యం లేకుండా చిత్రసీమలో అడుగుపెట్టిన కొందరు నటులు, తమ ప్రతిభతో కెరీర్​లో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అలాంటి వారిని చూస్తే అప్పటికే స్టార్​హోదాలో ఉన్నవారికి భయం. వారొచ్చి తమ స్థానానికి ఎసరు పెడతారేమోనని. దీంతో రాజకీయాలు చేయాలని చూస్తారు. ప్రతిరంగంలోనూ ఇలా జరుగుతుంది. జీవితంలో ప్రతిఒక్కరికి ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. వాటికి ఎదురెళ్లి ధైర్యంగా పోరాడి లక్ష్యాన్ని చేరుకోవాలి"

-మనోజ్​ బాజ్​పేయీ, ప్రముఖ నటుడు

'బండిట్​ క్వీన్'​, 'సత్య', 'స్కూల్​', 'గ్యాంగ్స్​ ఆఫ్​ వస్సీ​పూర్'​, 'అలీఘర్'​ లాంటి సూపర్​ హిట్​ సినిమాలతో విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు మనోజ్​.

ప్రస్తుతం 'భోన్స్​లె', 'సూరజ్​ పే మంగల్​ బిహారీ', 'ది ఫ్యామిలీ మెన్​ 2' వెబ్​సిరీస్​లో నటిస్తున్నారు.

ఇది చూడండి : 'సినీ పరిశ్రమ ప్రతిభావంతులను నిర్లక్ష్యం చేస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.