వాడి ప్రాబ్లమ్ వల్ల వాడికి అన్నీ ఎక్కువే. ఆస్తి, ఐశ్వర్యం, కోపం, ప్రేమ అన్నీ. ఎంత ఎక్కువ అంటే చిన్నప్పుడు వాడి దగ్గర ఓ కుక్క పిల్ల ఉండేది. అదంటే వాడికి ప్రాణం. వాడికి పదేళ్ల వయసపుడు అది చచ్చిపోయింది. లైఫ్‌లో మళ్లీ కుక్క పిల్లని దగ్గరికి రానీలేదు. వాడికి కోపం అది వాణ్ని వదిలేసి వెళ్లిపోయిందని. ఇప్పుడు మీరు చూస్తున్న అభి.. అభి కాదమ్మా. వాడు వేరు... వాడు వేరు.
వాడి కోపం ప్రళయం
వాడి ప్రేమ సముద్రం
వాడి జాలి వర్షం
ఈ మాట టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జునను ఉద్దేశించి తనికెళ్ల భరణి చెప్పి పదిహేడేళ్లవుతుంది. అప్పుడే? అనిపిస్తుంది కదా. అమ్మ, ఆవకాయ ఎప్పుడూ బోర్ కొట్టనట్టు 'మన్మథడు' కూడా బోర్ కొట్టడు. అందుకే ఎన్నిసార్లు చూసినా ఎప్పుడూ కొత్తగానే ఉంటుందీ చిత్రం. 2002 డిసెంబరు 20న విడుదలైంది. ఈ సందర్భంగా మన్మథుడ్ని ఓ సారి గుర్తు చేసుకుందాం..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తెలుగు చిత్ర పరిశ్రమలో గ్రీకువీరుడు, మన్మథుడుగా పిలుచుకునే నాగ్ అదే టైటిల్‌లో నటిస్తే అభిమానులకు ఇంకా కావాల్సింది ఏముంటుంది. దర్శకుడు విజయ్ భాస్కర్ అదే చేశాడు. నాగ్‌లోని ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. మన్మథుడు అంటే అందంతో అమ్మాయిల్ని తన చుట్టూ తిప్పించుకుంటాడు లేదా తనే అమ్మాయిల వెంట తిరుగుతాడు కానీ వెండితెర 'మన్మథుడు' మాత్రం అమ్మాయిల్ని ద్వేషిస్తాడు. దానికి కారణం ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది అనుకోవడం, అసలు ఏం జరిగిందో తెలుసుకోకపోవడం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఓ ప్రకటనా సంస్థలో మేనేజరుగా అభిరాం పాత్రలో ఒదిగిపోయాడు నాగ్. అదే కంపెనీలో ఉద్యోగిగా సోనాలి బింద్రే, అభి ప్రేమించిన అమ్మాయి మహేశ్వరిగా అన్షు ఆకట్టుకున్నారు. తనికెళ్ల భరణి, చంద్రమోహన్, రంగనాథ్, సుధ తన నటనతో అలరించారు. 'మన్మథుడు' అనగానే ముందుగా గుర్తొచ్చేవి రెండే రెండు. ఒకటి కామెడీ పంచ్‌లు, రెండు.. పాటలు.
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథతో పాటు మాటలు రాశాడు. నాగార్జున- ధర్మవరపు సుబ్రహ్మణ్యం మధ్య సాగే హాస్య సన్నివేశాలు చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే. నాగ్, సోనాలి, బ్రహ్మానందం పారిస్ వెళ్లినపుడు ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులోని సంగీతం అత్యద్భుతం. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం మనసును పిండేస్తుంది. ఆరు పాటు ఆరు ఆణిముత్యాలు. ప్రేమ, కామెడీ, సెంటిమెంట్ సమపాళ్లలో ఉన్న ఈ చిత్రం ఎప్పటికీ నూతనమే. మన్మథుడుని అక్కడితో ఆపకుండా 'మన్మథుడు 2'గా ఇటీవలే మన ముందుకొచ్చాడు నాగ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కొన్ని ఫేమస్ డైలాగ్స్
- అమ్మాయిలకి ప్రేమించడానికి టైం ఉంటుంది కానీ, పెళ్లి చేసుకోవడానికి ధైర్యం ఉండదు.. ప్రేమించే అప్పుడు పెద్దలు గుర్తుకురారు.. పెళ్లి చేసుకునేటపుడు ప్రేమించినోడు గుర్తుకురాడు.
- ప్రేమించేవాడికి భయం ఉండకూడదు.. భయపడేవాడు ప్రేమించకూడదు.. భయపడుతూ ప్రేమించేవాడు బాధపడకూడదు
- దేవుడు చాలా దుర్మార్గుడు లక్ష్మీ.. కళ్లు ఉన్నాయి అని సంతోషించే లోపే కన్నీళ్లు కూడా ఉన్నాయని గుర్తు చేస్తాడు.
- అబ్బాయిలు ప్రేమించడానికి తక్కువ టైం పట్టొచ్చు. కానీ మర్చిపోవడానికి జీవితం పడుతుంది. అదే అమ్మాయిలు ప్రేమించడానికి ఎక్కువ టైం పట్టొచ్చు.. కానీ క్షణంలో మర్చిపోతారు.
ఇవీ చూడండి.. టెనెట్ ట్రైలర్: 'మరణాంతర జీవితానికి స్వాగతం'