ETV Bharat / sitara

డ్రగ్స్​ పార్టీ: కరణ్​పై దిల్లీ మాజీ ఎమ్మెల్యే ఎన్​సీబీకి ఫిర్యాదు

author img

By

Published : Sep 17, 2020, 6:47 AM IST

బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత కరణ్​ జోహర్​పై దిల్లీ మాజీ ఎమ్మెల్యే మనిజిందర్​ శిర్షా ఎన్​సీబీకి ఫిర్యాదు చేశారు. గతేడాది తన నివాసంలో నిర్వహించిన ఓ పార్టీకి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారని.. అపుడు వారంతా డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపించారు శిర్షా.

karan
కరణ్

బాలీవుడ్​ నిర్మాత కరణ్​ జోహర్​ గతేడాది నిర్వహించిన పార్టీకి సంబంధించిన వీడియోపై దిల్లీ మాజీ ఎమ్మెల్యే మనిజిందర్​ శిర్షా నార్కొటిక్స్ కంట్రోల్​ బ్యూరో(​ఎన్​సీబీ)కి ఫిర్యాదు చేశారు. కరణ్​తో పాటు పార్టీకి హాజరైన పలువురు బాలీవుడ్​ ప్రముఖులపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఎన్​సీబీ చీఫ్​ రాకేశ్​ అస్థానాను కోరినట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

  • I met Sh. Rakesh Asthana, Chief of @narcoticsbureau at BSF head quarter, Delhi regarding submission of complaint for investigation & action against film Producer @karanjohar & others for organizing drug party at his residence in Mumbai
    That party video must be investigated into! pic.twitter.com/QCK2GalUQq

    — Manjinder Singh Sirsa (@mssirsa) September 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పార్టీకి సంబంధించిన వీడియోపై గతేడాది ముంబయి పోలీసులకు తాను ఫిర్యాదు చేసినట్లు మన్​జిందర్​ వెల్లడించారు. అయితే, విచారణ చేపట్టడంలో వారు విఫలమయ్యారని అన్నారు.

ఇందులో బాలీవుడ్​ ప్రముఖులు దీపికా పదుకొణె, విక్కీ కౌశల్​, మలైకా అరోరా, అర్జున్​ కపూర్​, రణ్​బీర్​ కపూర్​ తదితరులు పాల్గొన్నారు. అపుడు, వారంతా డ్రగ్స్ తీసుకున్నట్లు పలు ఆరోపణలు వచ్చాయి. వీటిపై స్పందించిన కరణ్​.. అక్కడ ఉన్నవారంతా సొంతగా ఎదిగి పైకి వచ్చినవారేనని ఒకవేళ వారంతా డ్రగ్స్​ తీసుకుని ఉంటే.. ఈ వీడియో నేనెందుకు మీ అందరితో పంచుకుంటా అంటూ బదులిచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.