ETV Bharat / sitara

ఆక్సిజన్​ అందక వీల్​ఛైర్​లోనే గాయకుడు మృతి - మంగనియార్​ సింగర్ తాలీబ్​ ఖాన్

రాజస్థాన్​కు చెందిన ప్రసిద్ధ మంగనియార్​ గాయకుడు తాలిబ్​ ఖాన్​ మరణించారు. సరైన సమయంలో ఆక్సిజన్​ అందక ఆస్పత్రి బయట వీల్​ఛైర్​లోనే తుదిశ్వాస విడిచారు.

Manganiyar singer Talib khan died while treatment after waiting for oxygen on wheelchair in Jaisalmer
ఆక్సిజన్​ అందక వీల్​ఛైర్​లోనే గాయకుడు మృతి
author img

By

Published : May 11, 2021, 9:22 AM IST

కరోనా రెండోదశలో పలువురు ప్రముఖులు మహమ్మారి బారిన పడి మరణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యల దగ్గరనుంచి సెలబ్రిటీల వరకు ఆక్సిజన్​ కష్టాలు తప్పడం లేదు. సరైన సమయంలో ఆక్సిజన్​ అందక రాజస్థాన్​కు చెందిన ప్రసిద్ధ మంగనియార్​ గాయకుడు తాలిబ్​ ఖాన్​ మరణించారు. ఆస్పత్రిలో పడక కోసం దాదాపు రెండు గంటలు వేచి ఉన్న ఆయన.. సకాలంలో చికిత్స అందక తుదిశ్వాస విడిచారు. దానికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

Manganiyar singer Talib khan died while treatment after waiting for oxygen on wheelchair in Jaisalmer
వీల్​ఛైర్​లోనే ప్రాణాలు వదిలిన గాయకుడు తాలిబ్ ఖాన్

ఏం జరిగిందంటే?

మూడు రోజులుగా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు.. సోమవారం ఆక్సిజన్​ స్థాయి గణనీయంగా పడిపోయింది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి చేర్చగా అక్కడ పడకలు అందుబాటులో లేవు. ఆ సమయంలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడినట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. అయితే రెండు, మూడు గంటల తర్వాత ఆయనకు బెడ్​ దొరికినా అంతలోనే ఆయన కన్నుమూసినట్లు తెలిపారు. ఆస్పత్రిలో పడక కోసం గంటల తరబడి వీల్​ఛైర్​లో వేచి చూసిన ఆయన అక్కడే ప్రాణాలను విడిచారని వారు వెల్లడించారు. అయితే తలాబ్​ ఖాన్​కు కరోనా సోకిందా? లేదా? అనేది తెలియాల్సిఉంది.

తాలిబ్ ఖాన్​ ఫొటో వైరల్​

ఇదీ చూడండి: డైరెక్టర్​ కావాలని యాక్టర్​ అయ్యాడీ హీరో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.