ETV Bharat / sitara

MAA Elections: రెబల్​స్టార్​ను కలిసిన మంచు విష్ణు - మంచు విష్ణు ప్యానెల్

'మా' ఎన్నికలు(MAA Elections) దగ్గర పడుతున్న క్రమంలో అధ్యక్ష పదవికి పోటీ పడనున్న ప్రకాశ్​ రాజ్​, మంచు విష్ణు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. అసోసియేషన్​ సభ్యుల సమావేశాల్లో ప్రకాశ్​ రాజ్​(Prakash Raj MAA Elections) బిజీగా ఉండగా.. మరోవైపు మంచు విష్ణు(Manchu Vishnu MAA Elections) సీనియర్​ నటుల మద్దతును కూడగట్టే పనిలో పడ్డారు.

Manchu Vishnu Meets Rebel Star Krishnam Raju To Gets The Support in MAA Elections
MAA Elections: రెబల్​స్టార్​ను కలిసి మద్దతు కోరిన మంచు విష్ణు
author img

By

Published : Oct 4, 2021, 4:00 PM IST

మరో ఆరు రోజుల్లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎన్నికల(MAA Elections) కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. అసోసియేషన్‌ సభ్యులందరితో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రకాశ్‌రాజ్(Prakash Raj MAA Elections) ఫుల్‌ బిజీగా ఉంటే.. మరోవైపు సినీ ఇండస్ట్రీలోని పెద్దలను కలిసి మద్దతు కోరుతున్నారు నటుడు మంచు విష్ణు.

ఈ క్రమంలో ఆదివారం నందమూరి బాలకృష్ణను కలిసిన విష్ణు.. అదేరోజు సాయంత్రం సీనియర్‌ నటుడు, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజును కలిశారు. కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన విష్ణు(Manchu Vishnu MAA Elections).. ఆయనతో మాట్లాడారు. 'మా' అభివృద్ధి కోసం తాను సిద్ధం చేసిన ప్రణాళికపై చర్చించారు. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విష్ణు ట్విట్టర్​లో ఓ ఫొటో షేర్‌ చేశారు. 'ఒరిజినల్‌ రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ఆశీర్వాదం తీసుకున్నా' అని విష్ణు తెలిపారు.

ఇదీ చూడండి.. Drugs Case News: ఆర్యన్‌తో ఫోన్​లో మాట్లాడిన షారుక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.