ETV Bharat / sitara

'మంచి కథ దొరికితే రిస్క్​ తీసుకోక తప్పదు'

చిత్రసీమలో రూపొందిన కమర్షియల్​ చిత్రాల కంటే పూర్తి భిన్నమైన చిత్రం 'మోసగాళ్లు' అని అంటున్నారు కథానాయకుడు మంచు విష్ణు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని తెలిపారు. ఆయన హీరోగా నటించిన 'మోసగాళ్లు' శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా విష్ణు.. తన చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

Manchu Vishnu interview in Mosagallu movie promotions
'మంచి కథ దొరికితే రిస్క్​ తీసుకోక తప్పదు'
author img

By

Published : Mar 18, 2021, 7:10 AM IST

"రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలకు పూర్తి భిన్నమైన చిత్రం 'మోసగాళ్లు'. ప్రేక్షకులకు కచ్చితంగా ఓ కొత్త అనుభూతిని పంచిస్తుంద"న్నారు మంచు విష్ణు. ఆయన హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో రూపొందించిన పాన్‌ ఇండియా చిత్రమిది. జెఫ్రీ గీ చిన్‌ దర్శకుడు. కాజల్‌ అగర్వాల్‌, సునీల్‌ శెట్టి ప్రధానపాత్రలు పోషించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు విష్ణు.

కథపై పరిశోధన

"ముంబయిలోని ఓ బస్తీలో ఉండే అక్కాతమ్ముడు అమెరికాలోని ప్రజల నుంచి రూ.2800 కోట్లు దోచుకున్నారు. వాళ్ల ఉద్దేశం ఏంటంటే.. తెల్లవాళ్ల దగ్గర డబ్బుంటుంది కాబట్టి వాళ్లను మోసం చేసినా తప్పులేదని. అయితే ఈ స్కామ్‌ వల్ల ఎక్కువగా అమాయకులు, రోజువారీ వేతనంపై ఆధారపడే శ్రమజీవులే నష్టపోయారు. మరి ఇంతటి భారీ కుంభకోణానికి కారణమైన వీరు ఎలా తప్పించుకున్నారన్నది కథాంశం. దీనిపై చాలా పరిశోధన చేశాం. ఈ స్కామ్‌ను ఇన్విస్టిగేట్‌ చేసిన డీసీపీని కలిసి.. ఈ కేసు పూర్వపరాలు తెలుసుకున్నా. ఆయన పాత్రనే సునీల్‌ శెట్టి పోషించారు".

Manchu Vishnu interview in Mosagallu movie promotions
మంచు విష్ణు

మరింత షాకవుతారు

"ఈ కథ ఫస్ట్‌ డ్రాప్ట్‌ నేనే రాశా. దాంట్లో కాస్త స్వేచ్ఛ తీసుకున్నా. నిజంగా జరిగిన కథ వింటే మాత్రం.. అందరూ ఇంకా షాకవుతారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ కోసం డైమండ్‌ రత్నబాబు సహాయం తీసుకున్నా. ఈ స్క్రిప్ట్‌లో 90శాతం యదార్థంగా జరిగిన కథే ఉంటుంది. ఓ 10శాతమే సినిమాకు తగ్గట్లుగా రాసుకున్నాం. క్లైమాక్స్‌లో చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది".

  • "తెలుగు వెర్షన్‌ కోసం కొన్ని ప్రత్యేక సన్నివేశాలు చిత్రీకరించి జత చేశాం. ఈ సినిమా ఇండియన్‌ వెర్షన్‌ 2.10గంటల నిడివి ఉంటే.. ఇంటర్నేషనల్‌ వెర్షన్‌ 1:15 గంటలు ఉంటుంది".
  • "నాకు పెద్ద సపోర్ట్‌ మా నాన్నే. ఈ సినిమా విషయంలో నా కన్నా.. మా ఇంట్లో వాళ్లకే ఎక్కువ టెన్షన్‌ ఉంది. ఒకొక్కసారి వాళ్లను అనవసరంగా ఒత్తిడిలోకి నెట్టేశానేమోనని నాపై నాకు కోపం వస్తుంటుంది. కథ నచ్చినప్పుడు రిస్క్‌ తీసుకోక తప్పదు".
  • "ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఢీ అండ్‌ ఢీ' సినిమా చేయనున్నా. మరో మూడు ప్రాజెక్ట్‌లు చేయనున్నా. వచ్చే నెలలో వాటి గురించి ప్రకటిస్తాం".

అందుకే ఈ సాహసం..

"దాదాపు రూ.50కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన చిత్రమిది. నాకున్నదంతా ఊడ్చి మరీ.. నా మార్కెట్‌ కన్నా రెట్టింపు ఖర్చు పెట్టి ఈ సినిమా తీశా. అందుకే కాస్త ఒత్తిడిగా ఉంది. ఇది అందరికీ కనెక్ట్‌ అయ్యే విశ్వజనీనమైన కథ ఇది. అందుకే దీన్ని పాన్‌ ఇండియా మూవీలా ముస్తాబు చేశాం. నిర్మాతనైనా.. సెట్లో నటుడిగానే ఉంటా."

ఇదీ చూడండి: అర్థం, పరమార్థం ఉన్న సినిమా ఇది: మోహన్​బాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.