ప్రముఖ నటుడు రజత్ బేడీ(Rajat Bedi Accident)పై కేసు నమోదైంది. ఓ రోడ్డు ప్రమాదం చేసినందున ఆయనపై కేసు నమోదు చేసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు.
ఇదీ జరిగింది..
"నటుడు రజత్ బేడీ చేసిన రోడ్డు యాక్సిడెంట్లో.. ముంబయి డీఎన్ నగర్‌కు చెందిన రాజేశ్ దూత్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని కూపర్ ఆసుపత్రిలో చేర్పించారు" అని డీఎన్ నగర్ సీనియర్ పోలీసు ఆఫీసర్ మిలింద్ కుర్దే తెలిపారు. ప్రస్తుతం దూత్ పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
ఘటన గురించి తెలియగానే పోలీసులు ఆసుపత్రికి వెళ్లినట్లు మిలింద్ స్పష్టం చేశారు. అయితే.. రజత్ బేడీ(Rajat Bedi News) ఆసుపత్రి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. మళ్లీ ఇప్పటివరకు రజత్ తిరిగిరాలేదని తెలిపారు. సెక్షన్ 279, 338 కింద రజత్‌పై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.
ఇదీ చదవండి:స్టార్ హీరో అక్షయ్‌కుమార్ తల్లి కన్నుమూత