బాలీవుడ్‌తో పాటు అంతర్జాతీయ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్న అందాల భామ మల్లికా షెరావత్. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఈ హాట్ బ్యూటీ.. యోగాసానాలు వేస్తూ అలరిస్తోంది. తాజాగా 'చక్రాసన'ను వేసి ఆ వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది.
"ఈ భంగిమను 'చక్రాసన' అని పిలుస్తారు. ప్రతిరోజు ఉదయం ఇలా దీనిని వేయడం చాలా మంచిది. రోజంతా ఉల్లాసంగా ఉండేలా శక్తిని ఇస్తుంది" అంటూ వ్యాఖ్యను జోడించింది. దీనితో పాటే కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలని నెటిజన్లకు సూచించింది. నిత్యం చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లోనే ఉండాలని సూచించింది. గతేడాది వచ్చిన హరర్ కామెడీ వెబ్‌సిరీస్ 'బూ సబ్కి ఫతేగి'లో చివరగా నటించింది మల్లికా.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి : సరోజినీ నాయుడు బయోపిక్‌లో 'రామాయణ్' సీత