మలయాళ దర్శకుడు-రచయిత నరన్పుల సన్వాస్(40).. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటుడు,నిర్మాత విజయ్ బాబు ఫేస్బుక్ వేదికగా వెల్లడించారు.
ప్రస్తుతం 'గాంధీరాజన్' తీస్తున్న సన్వాస్కు గత వారం సెట్లో ఉండగానే గుండెపోటు రావడం వల్ల ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న సమయంలో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆ తర్వాత కొంతసేపటికే బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈయన మృతిపై సహ దర్శకులు, పలువురు నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తొలి సినిమా 'కరీ'తో నరన్పుల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. రెండో చిత్రం 'సూఫియం సుజాతయుం'తో అలరించారు. అదితీరావు హైదరీ నటించిన ఈ సినిమా.. జులైలో అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది.