మలయాళ ప్రముఖ నటుడు రిజబవా(55) సోమవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కోచిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు.
ఆయన మృతిపట్ల మలయాళ స్టార్స్ దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు సంతాపం తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులర్పిస్తున్నారు.
కెరీర్ ప్రారంభంలో హాస్యభరిత పాత్రలతో ఆకట్టుకున్న రిజబవా.. 90ల్లో ప్రతినాయకుడిగా ఎన్నో సినిమాలు చేశారు.
1984లో 'విష్ణుపక్షి'తో చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పటికీ, ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత ఆరేళ్లకు 'డాక్టర్ పశుపతి' చిత్రంలో నటించి, మెప్పించి అందరి దృష్టి తనవైపు తిప్పుకోగలిగారు.
ఇవీ చదవండి: