ETV Bharat / sitara

శంకర్-చరణ్ చిత్రం కోసం మాళవిక! - మాళవిక మోహనన్ రామ్ చరణ్

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ ఓ చిత్రం తెరకెక్కించబోతున్నారు. అయితే ఇందులో చరణ్ పక్కన నటించబోయే హీరోయిన్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి. తాజాగా మాళవిక మోహనన్​ను ఈ మూవీ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది.

malavika with charan
చరణ్​తో మాళవిక మోహనన్
author img

By

Published : Jun 5, 2021, 10:12 AM IST

ఈ ఏడాది ఖరారైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో రామ్‌చరణ్‌-శంకర్‌ సినిమా ఒకటి. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలున్న ఈ చిత్రం గురించి తరచూ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం చరణ్‌కి జోడీగా నటించనున్న కథానాయిక ఎంపికపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.

malavika
మాళవిక మోహనన్

రష్మిక మందన్న మొదలుకొని పలువురు భామల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మాళవిక మోహనన్‌ పేరుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్‌ కథానాయకుడిగా నటించిన 'మాస్టర్‌' చిత్రంతో ఈ భామ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైంది. మరి శంకర్‌ ఈమెకే ఓటేస్తాడా? లేక మరో భామని పరిశీలిస్తారా? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.