ETV Bharat / sitara

ప్రభాస్​కు జోడిగా కేరళ కుట్టి మాళవిక - మారుతి

Malavika Mohanan: ప్రభాస్​తో తదుపరి చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు మలయాళ నటి మాళవిక మోహనన్​. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి రాజాడీలక్స్​ అనే పేరు పరిశీలనలో ఉంది.

prabhas with malavika
ప్రభాస్​తో జతకట్టనున్న కేరళ కుట్టి..
author img

By

Published : Mar 8, 2022, 7:58 PM IST

Malavika Mohanan: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ తదుపరి చిత్రంలో కథానాయికగా నటిస్తున్నట్లు తెలిపారు నటి మాళవిక మోహనన్​. కమర్షియల్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళ మీడియాతో మాట్లాడిన ఆమె ఈ విషయంపై స్పందించారు.

"తెలుగు చిత్రంలో నా భాగస్వామ్యంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ భారీ తెలుగు చిత్రంలో నటిస్తున్నాను. ఈ సమయంలో ఎలాంటి విషయాలు బయటపెట్టను కానీ ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం అవుతుంది."

-మాళవిక మోహనన్​

మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్​కు 'రాజాడీలక్స్' అనే పేరు​ను పరిశీలిస్తున్నారు మేకర్స్. ఈ సినిమాపై చిత్ర యూనిట్​ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. కామెడీ ఎంటర్​టైనర్​గా వస్తున్న ఈ చిత్రాన్ని 'ఆర్​ఆర్​ఆర్​' ప్రోడ్యూసర్​ డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ప్రభాస్​ అభిమానులకు హోలీ కానుకగా మార్చి 18న ఈ చిత్రంపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో 'ఉప్పెన' ఫేమ్​ కృతి శెట్టి ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. మాళవిక, 'పెళ్లి సందడీ' హీరోయిన్​ శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: గరికపాటిని నా సినిమా చూడమని చెప్పండి: పూనమ్ కౌర్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.