ETV Bharat / sitara

ప్రశాంతత కోసం మలైకా చెప్పిన యోగాసనాలు! - మలైకా అరోరా లేటెస్ట్​ న్యూస్

మానసిక భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం మూడు యోగాసనాలతో సాధ్యమని అంటోంది బాలీవుడ్​ నటి మలైకా అరోరా. ఇన్​స్టాగ్రామ్​లో ఆ మూడు యోగాసనాల గురించి చెప్పిన ఆమె.. వాటి ఆవశ్యకతను తెలియజేసింది.

Malaika Arora shares 3 asanas for mothers
ప్రశాంతత కోసం మలైకా చెప్పిన యోగాసనాలు!
author img

By

Published : May 11, 2021, 10:45 AM IST

Updated : May 11, 2021, 11:18 AM IST

'దిల్‌ సే' చిత్రంలో 'ఛయ్యా ఛయ్యా' అంటూ బాలీవుడ్‌లో ఐటెమ్‌ భామగా అరంగేట్రం చేసిన నటి మలైకా అరోరా. నటిగానే కాకుండా పలు టీవీ డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది. ఈ అమ్మడు 3 యోగాసనాలు వేసి వాటి గురించి వివరిస్తున్న వీడియోను ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. రోజూ ఇంట్లో ఉండే అమ్మలు ఈ మూడు ఆసనాలు సాధన చేస్తే మంచిదని తెలిపింది.

"రిలాక్స్, ప్రశాంతతమైన అనుభూతి చెందేందుకు మీరు అర్హులు. మీరు వృక్షాసన, త్రికోణాసన, ఉత్కాసన ఈ మూడు ఆసనాలు వేయండి.

1.వృక్షాసనం: ఒక కాలు మీద నిలబడి తమను తాము సమతుల్యం చేసుకుంటూ, చేతులను నేరుగా పైకి చాచాలి. శారీరక, మానసిక భావోద్వేగాల సమతుల్యతను కాపాడుతుంది.

2.త్రికోణాసన: ఇందులో తమ కాళ్లను చాచి కుడి పాదాన్ని కుడి చేతితో తాకి, ఎడమ చేతిని పైకి లేపాలి. ఈ ఆసనం ముఖ్యంగా పిల్లలకు పాలిచ్చే తల్లులకు సహాయపడుతుంది.

3.ఉత్కాసన: ఇందులో మోకాళ్లను కాస్త కిందకు వంచి నిలబడాలి. పైభాగాన్ని నిటారుగా ఉంచి వారి చేతులను ఒక చోట చేర్చాలి. ఈ ఆసనం మొత్తం శరీరంలో బలాన్ని పెంచుతుంది, ముఖ్యంగా వెనుక కండరాలను భుజాలలో మధ్య ఉన్న దాన్ని గట్టి పరుస్తుంది."

- మలైకా అరోరా, బాలీవుడ్​ నటి

మలైకా తెలుగులో మొదటి సారిగా మహేశ్​బాబు నటించిన 'అతిథి' చిత్రంలో ఓ పాటలో ఆడిపాడింది. తర్వాత పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన 'గబ్బర్‌ సింగ్‌'లో 'కెవ్వు కేక' సాంగ్‌తో తెలుగు ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకుంది.

ఇదీ చూడండి: ఈ హీరో తర్వాతి టార్గెట్​ పాన్​ఇండియా మూవీ!

Last Updated : May 11, 2021, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.