ఇండియాలో కరోనా కేసులు విజృంభిస్తుండటం వల్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి సామాన్య ప్రజలు, సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. గురువారం రోజు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాక్సిన్ వేయించుకోగా.. తాజాగా ప్రముఖ నటి మలైకా అరోరా టీకా తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.
"నేను మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా. వైరస్‌పై పోరాటం చేసి గెలుద్దాం. మీరు కూడా వ్యాక్సిన్ తీసుకోండి. మర్చిపోవద్దు.. థ్యాంక్యూ" అంటూ టీకా వేసుకుంటున్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది మలైకా.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
గతేడాది సెప్టెంబర్‌లో కరోనా బారినపడింది మలైకా అరోరా. దిగ్విజయంగా వైరస్ నుంచి బయటపడి.. తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.