ETV Bharat / sitara

అఘోరా పాత్ర కోసం రెండు గెటప్పులు - Balakrishna As Aghora

నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కలయికలో కొత్త చిత్రం రూపొందబోతుంది. ఈ సినిమాలో ఒక పాత్రలో అఘోరాగా కనిపించనున్నారు బాలయ్య. ఆ పాత్ర కోసం రెండు రకాల గెటప్పులు సిద్ధమైనట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన లుక్​ కోసం మేకప్​ టెస్ట్​లు జరగనున్నాయని సమాచారం.

Makeup Test for Balakrishna-Boyapati Srinu New Movie
బోయపాటి సినిమా కోసం మేకప్​​ టెస్ట్​ షురూ!
author img

By

Published : May 28, 2020, 7:45 AM IST

బాలకృష్ణ తెరపై ఎలా కనిపిస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో దర్శకుడు బోయపాటి శ్రీనుకి బాగా తెలుసు. 'సింహా', 'లెజెండ్‌' చిత్రాల్లో ఆయన్ని విభిన్నమైన గెటప్పుల్లో చూపించారు. ఆ ప్రయత్నం అభిమానులకి ఎంత బాగా నచ్చిందో, సగటు ప్రేక్షకుడికీ అంతే నచ్చింది. బాలకృష్ణ - బోయపాటి కలయికలో సినిమా అంటే చాలా అంచనాలుంటాయి. వీరిద్దరిదీ విజయవంతమైన కలయిక. 'సింహా', 'లెజెండ్‌' తర్వాత ముచ్చటగా మూడోసారి కలిసి సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు బోయపాటి. గెటప్పుల విషయంలో కసరత్తులు మరింత పక్కాగా జరుగుతున్నాయి.

ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు కోణాల్లో కనిపిస్తారు. ఒక పాత్రలో అఘోరాగా కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం రెండు రకాల గెటప్పులు సిద్ధమైనట్టు సమాచారం. లాక్‌డౌన్‌ తర్వాత ఆ గెటప్పులతో మేకప్‌ టెస్ట్‌లు జరగబోతున్నాయట. అందులో ఒక గెటప్పుని ఖాయం చేసి, సినిమాని పట్టాలెక్కించబోతున్నారు. బాలయ్య సరసన ఈ చిత్రంలో ఓ కొత్త కథానాయిక సందడి చేయనున్నట్టు సమాచారం. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి... రూపం మనోహరం... అభినయం అనితర సాధ్యం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.