ETV Bharat / sitara

యాంకర్ సుమ సీరియస్ నోట్.. ఏంటంటే?

కరోనా కారణంగా సినీ పరిశ్రమకు భారీ నష్టాలు వస్తున్నాయి. ఈ రంగంలో పనిచేసే కార్మికులకు ఉపాధి కరవైంది. తాజాగా ఈ విషయంపై ఓ వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు యాంకర్ సుమ.

Suma
సుమ
author img

By

Published : May 28, 2021, 8:58 AM IST

కరోనా ఉద్ధృతితో యావత్‌ ప్రపంచమే స్తంభించిపోయింది. ప్రస్తుతం మన దేశం అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. లాక్‌డౌన్‌తో దాదాపు అన్ని రంగాలూ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇక సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే మునుపెన్నడూ చూడనంత నష్టం చిత్రసీమకు వాటిళ్లింది. గతేడాది లాక్‌డౌన్‌ దెబ్బతో మూతబడ్డ థియేటర్లు అలా తెరుచుకున్నాయో.. లేదో.. మళ్లీ కరోనా విరుచుకుపడింది. దీంతో మళ్లీ థియేటర్లు మూయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సినీ కార్మికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. కాగా.. పరిశ్రమ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ యాంకర్‌ సుమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఉద్వేగభరితమైన పోస్టు చేశారు. మేకప్‌ కిట్లు బూజుపట్టిపోతున్నాయంటూ ఆమె మేకప్‌ వేసుకుంటూ ఆ వీడియోలో కనిపించారు.

ఇవీ చూడండి: సుమను ఆటపట్టించిన హీరో నాని

"వీడియోను సరదాగా చూడండి. నోట్‌ మాత్రం కాస్త సీరియస్‌గానే చదవండి. వినోద పరిశ్రమలో మేం శారీరకంగా పనిచేయాల్సి ఉంటుంది. అదే మా కడుపు నింపేది. అంటే నటీనటులు, వ్యాఖ్యాతలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, కెమెరామెన్, లైట్ మెన్, ఫైట్ మాస్టర్స్, ఎడిటర్స్, మేకప్, హెయిర్‌స్టైలిస్ట్, ఆర్ట్, ఫుడ్, ప్రొడక్షన్ ఇలా అన్నీ సెట్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. వారంతా ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు. మళ్లీ పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల కుటుంబాలను పోషించడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే మళ్లీ ఇండస్ట్రీ పనులు మొదలవుతాయని భావిస్తున్నా" అని సుమ రాసుకొచ్చారు.

  • Watch this video on a lighter note. On a serious note, read this, entertainment industry requires us to be physically present to do our job which is our bread and butter. That means the actors, anchors, directors, producers, music directors, cameramen, Jimmy, light men,..(Cont.,) pic.twitter.com/3ez1ezckgs

    — Suma Kanakala (@ItsSumaKanakala) May 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.