ETV Bharat / sitara

అక్షయ్​ 'బెల్ ​బాటమ్​' ఓటీటీ రిలీజ్​పై క్లారిటీ

author img

By

Published : May 1, 2021, 7:35 PM IST

Updated : May 1, 2021, 8:32 PM IST

బాలీవుడ్​ స్టార్​ అక్షయ్​కుమార్​ నటించిన 'బెల్​ బాటమ్'​ చిత్రం ఓటీటీలో విడుదల కానున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేసింది చిత్ర నిర్మాణ సంస్థ. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా తాము అధికారికంగా ప్రకటించేవరకు పరిగణలోకి తీసుకోవద్దని సూచించింది.

bellbottom
బెల్​బాటమ్​

బాలీవుడ్​ స్టార్​ అక్షయ్​కుమార్​ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బెల్​ బాటమ్'​. ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్​ఫామ్​లో విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా దీనిపై స్పందించిన ఈ చిత్ర నిర్మాణ సంస్థ పూజా ఎంటర్​టైన్​మెంట్స్​ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇవన్నీ అవాస్తమని స్పష్టం చేసింది. సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా తాము సరైన సమయంలో ప్రకటిస్తామని చెప్పింది. వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.

స్పై-థ్రిల్లర్​ కథతో రూపొందుతోన్న 'బెల్​ బాటమ్'కు రంజిత్​ ఎమ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. వాణీ కపూర్, హ్యుమా ఖురేషీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనా కట్టడికి అక్షయ్, ట్వింకిల్ సాయం

Last Updated : May 1, 2021, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.