తెలుగు సినీ ప్రేక్షకుల్ని మెప్పించిన 'మెయిల్' సినిమా అద్భుత ఘనత సాధించింది. జూన్ 4న మొదలయ్యే న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
ఈ ఏడాది ప్రారంభంలో 'ఆహా' ఓటీటీలో వచ్చిన 'మెయిల్'.. గ్రామీణ నేపథ్య కథతో తెరకెక్కించారు. కంప్యూటర్ వచ్చిన కొత్తలో దానివల్ల ఓ గ్రామంలోని ముగ్గురు యువకులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? వాటివల్ల ఎదురైన ఇబ్బందుల్ని ఎలా అధిగమించారు? అనే కథతో సినిమా తీశారు. ప్రియదర్శి, హర్ష, ప్రియ తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఉదయ్ గుర్రాల దర్శకుడిగా ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">