ETV Bharat / sitara

మహేశ్​, దీపిక, కాజల్​ సెంటిమెంట్లు ఏంటో తెలుసా? - sentiment

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మందికి ఏదో ఒక సెంటిమెంట్​ ఉండటం సర్వసాధారణం. వాటిని తప్పకుండా ఫాలో అవుతుంటారు. వీరిలో మహేశ్​బాబు, ఎన్టీఆర్​, కాజల్​ అగర్వాల్​, దీపికా పదుకొణె సహా చాలా మంది నటులే ఉన్నారు. మరి వారెవరు? వారి సెంటిమెంట్లు ఏంటో చూసేద్దాం..

mahesh babu
మహేశ్​బాబు
author img

By

Published : Nov 14, 2021, 8:39 AM IST

ఏదయినా ఓ పనిని ప్రారంభించే ముందు ఫలానా రంగు డ్రెస్‌నే వేసుకోవడం... తప్పనిసరిగా గుడికి వెళ్లాలనుకోవడం చాలామంది చేసేదే. మరి తెరమీద నటించే హీరోహీరోయిన్లకు కూడా అలాంటి సెంటిమెంట్లు ఉంటాయా అంటే ఉంటాయనే అంటున్నారు కొందరు. అవేంటో కాస్త చూసేద్దాం..

గణపతి ఆలయానికి వెళ్తే హిట్‌ - దీపికా పదుకొణె

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణెకు(Deepika padukone latest news) ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆమె ఓ సినిమా ఒప్పుకుంటే... అది కచ్చితంగా హిట్‌ అయి తీరుతుందనేది దర్శకనిర్మాతల నమ్మకమైతే... ఆమె మాత్రం తన సినిమా విడుదలకు ముందు వినాయకుడి ఆశీస్సులు తప్పనిసరిగా తీసుకుంటుందట. తన ప్రతి సినిమా విడుదలకు ముందు ముంబయిలోని సిద్ధివినాయక ఆలయానికి వెళ్లి, పూజలు నిర్వహిస్తుంది దీపిక. అలా చేస్తే ఆ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుందనేది తన నమ్మకమని అంటుంది దీపిక.

deepika
దీపికా పదుకొణె

ఆ నంబరంటే ఇష్టం- ఎన్టీఆర్‌

ఎంతో ఇష్టంగా కొనుక్కునే(NTR latest news) వాహనానికి ఫ్యాన్సీ నంబరు ఉండాలని కోరుకోవడం మామూలే కానీ... ఎన్టీఆర్‌ మాత్రం 9999 నంబరు కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టేందుకు అస్సలు వెనకాడడు. ఈ మధ్యే తాను కొన్న లాంబోర్గినీ కారుకు ఆ నంబరు తెచ్చుకునేందుకు సుమారు పదిహేడు లక్షల రూపాయలు పెట్టాడట. ఆ సంఖ్య పైన ఎందుకంత ఇష్టమంటే... 'మా తాతగారి కారుకు అదే నంబరు ఉండేది. ఆ తరువాత నాన్న కూడా తన కార్లకు ఆ నంబరునే వాడారు. చిన్నప్పటినుంచీ వాటిని చూశాక... అదే నా లక్కీనంబర్‌ అయిపోయింది. అందుకే నేను కొనే ప్రతి కారుకీ ఆ నంబరే ఉండేలా చూసుకుంటా...' అని చెప్పే తారక్‌ ట్విటర్‌ అకౌంట్‌ పేరులోనూ 9999 ఉంటాయి తెలుసా..

NTR
ఎన్టీఆర్​

ముహూర్తం రోజున రాకపోవచ్చు- మహేష్‌బాబు

ఏ హీరోహీరోయిన్‌ అయినా(mahesh babu latest news)... సినిమా ఒప్పుకున్నాక ముహూర్తపుషాట్‌కూ, ఆ రోజున చేసే పూజా కార్యక్రమాలకూ తప్పనిసరిగా వస్తారు. కానీ ఎన్నో హిట్‌ సినిమాలను అందించిన మహేష్‌బాబు మాత్రం ముహూర్తపు షాట్‌కు హాజరవ్వకుండా నేరుగా షూటింగ్‌కే వెళ్తాడట. అదేవిధంగా షూటింగ్‌ అంతా పూర్తయ్యాక అజ్మీర్‌, అమీన్‌పీర్‌ దర్గాలకు వెళ్లొచ్చేందుకు ప్రయత్నిస్తాడట. అలా 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు', 'ఆగడు', 'దూకుడు', 'బిజినెస్‌మ్యాన్‌' సినిమాల విడుదలకు ముందు అక్కడికి వెళ్లొచ్చాడట. ఇవేవీ పెద్ద సెంటిమెంట్లుగా పాటించకపోయినా ముందునుంచీ అలాగే కొనసాగిస్తున్నాడట.

maheshbabu
మహేశ్​బాబు

తొలి సీన్‌లో తెల్ల డ్రెస్‌ - కాజల్‌ అగర్వాల్‌

సినిమాల్లో హీరో హీరోయిన్‌లని పరిచయం చేసే సన్నివేశాలు కొత్తగా ఉండాలని దర్శకులు కోరుకుంటే... కాజల్‌ అగర్వాల్‌(kajal agarwal latest news) మాత్రం ఆ సీన్‌లలో సాధ్యమైనంతవరకూ తెలుపు రంగు డ్రెస్‌లో కనిపించాలనుకుంటుందట. అలా నటిస్తే ఆ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుందనేది కాజల్‌ నమ్మకం. అందుకే తమిళంలో విజయ్‌ సరసన చేసిన 'తుపాకి'లో, బాలీవుడ్‌లో అజయ్‌దేవగణ్‌తో నటించిన ‘సింగం’లోనూ తెలుపు రంగు డ్రెస్‌లో కనిపించింది. ఈ నమ్మకాన్ని మగధీర సినిమా నుంచీ పాటిస్తోందట.

kajal
కాజల్​ అగర్వాల్​

జపమాల ఉండాల్సిందే- సాయిపల్లవి

చీరకట్టుకుంటే చేతినిండా గాజులు, జీన్స్‌ తొడిగితే బ్రేస్‌లెట్‌ పెట్టుకోవడం... అమ్మాయిలు చేసేదే. కానీ సాయి పల్లవి మాత్రం(saipallavi latest news) ఎలాంటి ఆహార్యమైనా సరే.. తన చేతికి జపమాల ఉండాల్సిందేనని అంటుంది. ‘కొన్నాళ్లక్రితం మా తాతయ్య ఆ జపమాలను నాకు ఇచ్చాడు. అప్పటినుంచీ దాన్ని చేతికి కట్టుకుని కాసేపు ధ్యానం చేయడం మొదలుపెట్టా. అలా చేస్తే నేను రోజంతా ప్రశాంతంగా ఉంటానని నా నమ్మకం. ఒక్క షూటింగ్‌లలో మాత్రమే దాన్ని కాసేపు పక్కన పెడతా తప్ప.మిగిలిన సమయమంతా ఆ జపమాల నా చేతికే ఉంటుంద’ని వివరిస్తుంది సాయిపల్లవి.

saipallavi
సాయిపల్లవి

ఇదీ చూడండి: Balakrishna unstoppable: బాలయ్య టాక్ షోలో డార్లింగ్ హీరో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.