ETV Bharat / sitara

త్రివిక్రమ్​తో మహేశ్​ 28వ సినిమా ఫిక్స్​​ - mahesh babu new movie

'సర్కారు వారి పాట' తర్వాత హీరో మహేశ్​బాబు నటించనున్న కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. త్రివిక్రమ్​ దర్శకత్వంలో సూపర్​స్టార్​ సినిమా ఖరారైంది. 2022 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

Mahesh babu-trivikram
మహేశ్​-త్రివిక్రమ్
author img

By

Published : May 1, 2021, 5:46 PM IST

కొంతకాలంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబో ఖరారైపోయంది. సూపర్​స్టార్​ మహేశ్​ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్​లో సినిమాను అధికారికంగా ప్రకటించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా 'ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28' వర్కింగ్ టైటిల్​తో రూపొందుతోంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. 2022 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాను ఎస్​ రాధాకృష్ణ నిర్మాతగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్​ నిర్మించనుంది.ఇక ఈ చిత్రంలో హీరోయిన్​గా పూజాహెగ్డేను తీసుకోనున్నట్లు సమాచారం.

గతంలో త్రివిక్రమ్‌-మహేశ్​ బాబు కాంబినేషన్లో 'అతడు', 'ఖలేజా' వంటి చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం మహేశ్​ 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.