ETV Bharat / sitara

వెంకీ కుడుముల దర్శకత్వంలో మహేశ్! - Mahesh Babu new movie

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తదుపరి చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పలువురు దర్శకుల పేర్లు వినిపించినా.. తాజాగా మరో డైరెక్టర్​ ఆ ఛాన్స్ దక్కించుకున్నాడని తెలుస్తోంది.

మహేశ్
మహేశ్
author img

By

Published : Mar 17, 2020, 4:32 PM IST

ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ఏంటా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 'మహేశ్ 27' వంశీ పైడిపల్లి తెరకెక్కించాల్సి ఉన్నా పలు కారణాల వల్ల ఆలస్యమవుతోంది. అందుకే ఈలోపు మరో దర్శకుడికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ప్రిన్స్. ఈ నేపథ్యంలోనే 'గీత గోవిందం' ఫేం పరశురాం పేరు వినిపించింది. దాదాపు ఖరారు అని వార్తలొచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.

తాజాగా మహేశ్​ను డైరెక్ట్‌ చేయబోయే దర్శకుల జాబితాలో వెంకీ కుడుముల చేరాడు. నాగశౌర్య హీరోగా వచ్చిన 'ఛలో' చిత్రంతో దర్శకుడిగా మారాడు వెంకీ. నితిన్‌తో 'భీష్మ' తెరకెక్కించి హిట్‌ అందుకున్నాడు. ఈ రెండు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న వెంకీ.. మహేశ్​కు ఓ కథ వినిపించాడని సమాచారం. వెంకీ చెప్పిన స్టోరీ లైన్‌ ప్రిన్స్​కు నచ్చిందని, కొన్ని మార్పులు చేసి సంప్రదించమని చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.