ETV Bharat / sitara

కరోనాపై యుద్ధానికి నేనుసైతం అంటోన్న మహేశ్

కరోనా వైరస్​ను అరికట్టాలంటే ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అంటున్నారు సినీ తారలు. ఈ సందర్భంగా బాలీవుడ్ హీరోలతో కలిసి మాస్క్ ధరించిన ఫొటోను షేర్ చేశారు సూపర్ స్టార్ మహేశ్ బాబు.

మహేశ్
మహేశ్
author img

By

Published : May 27, 2020, 5:55 PM IST

ప్రస్తుతం ప్రపంచమానవాళిని వణికిస్తున్న కరోనా వైరస్‌పై పోరాటానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని అంటున్నారు సినీతారలు. అందులో భాగంగా తెలుగు హీరో మహేశ్​ బాబు తనవంతుగా సామాజిక మాధ్యమాల్లో తగిన జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్‌ నటీనటులతో కలిసి కరోనాపై ప్రచారం చేస్తున్నారు మహేశ్.

కరోనా వైరస్​ను అరికట్టాలంటే మాస్క్ తప్పనిసరని చెబుతున్నారు సినీతారలు. అయితే ప్రజల్లో అవగాహన కోసం ప్రముఖ సెలిబ్రిటీ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవరికర్ ఓ వినూత్న ఆలోచన చేశారు. ఇంతకుముందు ఆయన ఫొటోషూట్ చేసిన ఫొటోలను తాజాగా నెట్టింట షేర్ చేశారు. దీనిని సూపర్​స్టార్ మహేశ్ అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో అమితాబ్‌ బచ్చన్‌, ప్రియాంక చోప్రా, హృతిక్‌ రోషన్‌, షారుక్‌ ఖాన్‌, ఆలియా భట్‌, టైగర్‌ ష్రాఫ్‌తో పాటు క్రికెటర్‌ ఎం.ఎస్‌.ధోనీ కూడా ఉన్నారు.

మహేశ్ ఇప్పటికే ట్విట్టర్‌ వేదికగా మాస్క్ ధరించిన ఫొటోను పెట్టారు. ఆ ఫొటోకి.."అందరూ సురక్షితంగా ఉండాలంటే బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించండి.." అనేె వ్యాఖ్య జోడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.