ETV Bharat / sitara

'సర్కారు వారి పాట'​ ఫొటోలు.. ఇన్​స్టాలో మహేశ్​ పోస్ట్ - మహేశ్ బాబు న్యూస్

తన కొత్త లొకేషన్​ ఫొటోలు కొన్నింటిని మహేశ్​ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దుబాయ్​లో శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది.

mahesh babu post sarkaru vaari paata shooting location pictures
'సర్కారు వారి పాట'​ ఫొటోలు.. ఇన్​స్టాలో మహేశ్​ పోస్ట్
author img

By

Published : Feb 4, 2021, 5:04 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు.. 'సర్కారు వారి పాట' షూటింగ్​లో భాగంగా దుబాయ్​లో ఉన్నారు. చిత్రీకరణ ఫొటోలు కొన్ని ఇప్పటికే వైరల్​ అవుతుండగా, లోకేషన్​కు సంబంధించిన మూడు ఫొటోలను మహేశ్​ స్వయంగా ఇన్​స్టాలో పోస్ట్ చేశారు. 'ఇన్5దుబాయ్'​ సంస్థలో షూటింగ్​ చేయడం మర్చిపోలేని అనుభూతి అని రాసుకొచ్చారు.

ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్​గా నటిస్తోంది. బ్యాంకుల్లో డబ్బుల ఎగవేత నేపథ్య కథతో దీనిని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్, జీఎమ్​బీ ఎంటర్​టైన్​మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి చిత్రాన్ని తీసుకురానున్నారు.

ఇది చదవండి: గొడుగు కింద హీరో మహేశ్.. ఎండలో నేలపై దర్శకుడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.