సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. 'సరిలేరు నీకెవ్వరు..' అంటూ సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. స్వాత్రంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఈ గేయాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్రబృందం.
'సరిలేరు నీకెవ్వరు... నువ్వెళ్లే రహదారికి జోహారు..' అంటూ శ్రోతల్ని అలరిస్తోందీ గేయం. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా.. దీపక్ ఆలపించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. రష్మిక మందణ్న హీరోయిన్. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇది చదవండి: 'ఒరిజినల్ కంటే బాగా తెరకెక్కించాం'