సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగానే కాకుండా సోషల్ మీడియాలోనూ యమక్రేజ్ తెచ్చుకున్నారు. ఇటీవలే ట్విట్టర్లో 10 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుని ఏ దక్షిణాది నటుడికి సాధ్యమవని రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో తనను అభిమానిస్తూ అనుసరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
"నా మనసులోని కృతజ్ఞతా భావాన్ని మీకు తెలిపేందుకు కోటి ధన్యవాదాలు అయినా సరిపోవు. మీ అందరితో ఇలాంటి వేదిక ద్వారా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేమతో మీ అందరికి ధన్యవాదాలు" అని మహేశ్‌బాబు రాసుకొచ్చారు.
-
10 MILLION thanks can never sum up the immense gratitude I have! Truly happy to be virtually connected with all of you... Much love🤗 #10MillionStrong pic.twitter.com/xIA8Oa7zdk
— Mahesh Babu (@urstrulyMahesh) July 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">10 MILLION thanks can never sum up the immense gratitude I have! Truly happy to be virtually connected with all of you... Much love🤗 #10MillionStrong pic.twitter.com/xIA8Oa7zdk
— Mahesh Babu (@urstrulyMahesh) July 3, 202010 MILLION thanks can never sum up the immense gratitude I have! Truly happy to be virtually connected with all of you... Much love🤗 #10MillionStrong pic.twitter.com/xIA8Oa7zdk
— Mahesh Babu (@urstrulyMahesh) July 3, 2020
ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరు' అంటూ వచ్చిన మహేశ్.. 'సర్కారు వారి పాట'లో నటించనున్నారు. కరోనా కారణంగా ఇంకా షూటింగే ప్రారంభం కాలేదు. అయితే ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌లుక్.. సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవీ చదవండి: