ETV Bharat / sitara

అమ్మాయిల కలల 'రాకుమారుడు'.. సాయంలో 'శ్రీమంతుడు' - latset superstar mahesh babu latest birth day updates

టాలీవుడ్​ హీరో మహేశ్​బాబు.. నేడు(ఆదివారం) 45వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా తన గ్లామర్​, నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ కథానాయకుడిపై స్పెషల్ స్టోరీ.

mahesh babu birthday story
మహేశ్​ బాబు
author img

By

Published : Aug 9, 2020, 5:26 AM IST

'మహేశ్... ఆ పేరులో మత్తుంది, ఆ పేరులో వైబ్రేషన్స్​ ఉన్నాయి'.. ఇది ఒక తెలుగు సినిమాలోని డైలాగ్​ కావొచ్చు, కానీ ఇదొక్కటి చాలు మహేశ్​బాబు క్రేజ్​ ఏంటో చెప్పడానికి. తనదైన మేనరిజం, నటన, డ్యాన్స్​తో ప్రేక్షకుల్ని మెప్పించిన ప్రిన్స్.. ప్రస్తుతం టాలీవుడ్​లో అగ్రహీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లవుతున్నా తన గ్లామర్​తో కుర్రహీరోలకు పోటీ ఇస్తున్నారు. నేడు 45వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సూపర్​స్టార్​పై ప్రత్యేక కథనం.

కుటుంబ నేపథ్యం

సూపర్‌ స్టార్‌ కృష్ణ నాలుగో సంతానం మహేశ్ బాబు. ప్రిన్స్‌కు ఇద్దరు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. మహేశ్​కు ప్రియదర్శని అనే చెల్లెలు ఉంది. ఈమె భర్తే నటుడు సుధీర్‌బాబు. అమ్మమ్మ దుర్గమ్మ దగ్గర పెరిగిన ప్రిన్స్​ చదువంతా మద్రాస్​లో సాగింది. అక్కడి లయోలా కాలేజ్‌లో కామర్స్‌ విభాగంలో డిగ్రీ పట్టా పొందారు.

mahesh babu birthday story
మహేశ్​ బాబు

బాలనటుడిగా సినిమాల్లోకి అరంగేట్రం చేశారు మహేశ్​. ఆ వయసులోనే తనదైన శైలి నటనతో మెప్పించారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మొదటి సినిమా 'నీడ'. ఓ పక్క చదువుకుంటూనే సినిమాల్లో నటించారు. 'పోరాటం', 'శంఖారావం', 'బజారు రౌడీ', 'గూఢచారి 117', 'కొడుకు దిద్దిన కాపురం', 'బాలచంద్రుడు' చిత్రాలతో ప్రేక్షకులను కట్టిపడేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినీ ప్రస్థానం

1999లో 'రాజకుమారుడు'తో హీరోగా తెరంగేట్రం చేశారు మహేశ్​. ఆ తర్వాత 'యువరాజు', 'వంశీ', 'మురారి', 'టక్కరి దొంగ', 'బాబీ', 'ఒక్కడు', 'నిజం', 'నాని', 'అర్జున్‌', 'అతడు', 'పోకిరి', 'సైనికుడు', 'అతిథి', 'ఖలేజా', 'దూకుడు' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇటీవలే సంక్రాతి కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో సూపర్​ హిట్​ అందుకున్నారు.

mahesh babu birthday story
మహేశ్​ బాబు

విభిన్న పాత్రల్లో మెరిసిన ప్రిన్స్ 'శ్రీమంతుడు'గా ఊరిని దత్తత తీసుకోమని సందేశమిచ్చినా, 'టక్కరి దొంగ'గా అలరించినా, సోదరిని అమితంగా ప్రేమించే 'అర్జున్‌'గా... ఇలా ప్రతి పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడీ ఘట్టమనేని అందగాడు. సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించేలా 'భరత్‌ అనే నేను' చిత్రంలో భరత్‌ పాత్రలో మహేశ్ అలవోకగా ఒదిగిపోయారు. ఇక దేశం కోసం ప్రాణాలను పనంగా పెట్టి కాపుకాస్తున్న సైనికుల త్యాగాలను 'సరిలేరు నీకెవ్వరు'తో కళ్లకు కట్టినట్లు చూపించారు.

తాజాగా 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు ప్రిన్స్. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుందీ చిత్రం.

mahesh babu birthday story
'సర్కారు వారి పాట'లో మహేశ్​

వాణిజ్య ప్రకటణలు

సినిమాలతోనే కాదు వాణిజ్య ప్రకటనలతోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు మహేశ్​. వాటికి తోడు ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించారు, వ్యవహరిస్తున్నారు. ఇటీవలే సొంతంగా బ్రాండెడ్​ దుస్తుల వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చారు.

అవార్డులు

తొలి సినిమా 'రాజకుమారుడు'కు ఉత్తమ నూతన నటుడు కేటగిరీలో నంది పురస్కారం.

'మురారి', 'టక్కరి దొంగ', 'అర్జున్‌' చిత్రాలకు నంది స్పెషల్‌ జ్యూరీ పురస్కారం.

'నిజం', 'అతడు', 'దూకుడు', 'శ్రీమంతుడు' చిత్రాలకు నంది ఉత్తమ నటుడు పురస్కారాలు.

నమ్రతతో వివాహం

'వంశీ' సినిమాలో తనతో నటించిన హీరోయిన్‌ నమ్రతనే పెళ్లి చేసుకున్నారు మహేశ్ బాబు. ఇప్పటికీ టాలీవుడ్‌ స్వీట్‌ కపుల్స్‌ అంటే గుర్తొచ్చేది మహేశ్-నమ్రతా శిరోద్కర్‌ జోడీనే. 2000 సంవత్సరంలో ప్రేమలో పడిన వీరిద్దరూ ఐదేళ్ల పాటు ప్రేమించుకుని, 2005లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.

వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు మహేశ్​బాబు. వీలున్నప్పుడల్లా కుటుంబంతో గడుపుతూ ఎప్పటికప్పుడు తన పిల్లలతో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్​ చేస్తుంటారు​.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.