టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి టీజర్ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6.. ఉదయం 9.09 గంటలకు విడుదల కానుంది. ఈ విషయంతో పాటే మరో కొత్త పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. స్టైలిష్ లుక్తో ఆకట్టుకుంటున్నాడు ప్రిన్స్. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.
మహేశ్ 25వ చిత్రమైన 'మహర్షి'పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాను తెరకెక్కించామని చిత్ర యూనిట్ చెబుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. నటుడు అల్లరి నరేశ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
దిల్ రాజు, పీవీపీ, వైజయంతీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. రష్మికకు విషెస్ కాస్త డిఫరెంట్గా..