గురువారం విడుదలైన మహేశ్‌బాబు సినిమా 'మహర్షి'. రైతులకు సంబంధించిన కథాంశంతో వచ్చిన ఈ చిత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. తాజాగా మహర్షి టీమ్ అంతా 'డియర్ కామ్రేడ్' చిత్రబృందంతో కలిసి వేడుకలు చేసుకుంది. సంబంధిత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది 'డియర్ కామ్రేడ్'. విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్న హీరో హీరోయిన్లు. జూలై 26న సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు మహేశ్‌బాబుతో వేడుకల్లో విజయ్ పాల్గొనడం సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. త్వరలో సూపర్‌స్టార్ నిర్మాతగా, విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం.
