'మహర్షి' సినిమా ఈ నెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే హైదరాబాద్‌లోని పలు థియేటర్ల యాజమాన్యాలు టికెట్ల ధరలు పెంచేశాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 30 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ. 50 పెంచారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో రూ.138 ఉన్న టికెట్ ధర రూ.200కి చేరింది. అయితే ప్రభుత్వ అనుమతితోనే ధరలు పెంచినట్లు యాజమాన్యాలు పేర్కొన్నాయి. రెండు వారాలపాటు ఇవే టికెట్ రేట్లు అమలులో ఉండనున్నాయి.
-
R I S H I 🔥🔥🔥#MaharshionMay9th@urstrulyMahesh @directorvamshi @hegdepooja @allarinaresh @ThisisDSP @KUMohanan1 @Cinemainmygenes @ShreeLyricist #SSMB25 #Maharshi pic.twitter.com/ukTngcU1If
— Sri Venkateswara Creations (@SVC_official) May 7, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">R I S H I 🔥🔥🔥#MaharshionMay9th@urstrulyMahesh @directorvamshi @hegdepooja @allarinaresh @ThisisDSP @KUMohanan1 @Cinemainmygenes @ShreeLyricist #SSMB25 #Maharshi pic.twitter.com/ukTngcU1If
— Sri Venkateswara Creations (@SVC_official) May 7, 2019R I S H I 🔥🔥🔥#MaharshionMay9th@urstrulyMahesh @directorvamshi @hegdepooja @allarinaresh @ThisisDSP @KUMohanan1 @Cinemainmygenes @ShreeLyricist #SSMB25 #Maharshi pic.twitter.com/ukTngcU1If
— Sri Venkateswara Creations (@SVC_official) May 7, 2019
ఐదుకు అనుమతి...
తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకు 5 షోల వరకు అనుమతి ఇచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం కావడం వల్ల ఈ అవకాశం కల్పించింది. మే 9 నుంచి మే 22 వరకు ఈ విధంగానే సినిమా ప్రదర్శించనున్నారు.
ప్రిన్స్ మహేశ్ బాబుతో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. వంశీ పైడిపల్లి దర్శకుడు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు బాగా ఆకట్టుకున్నాయి.