ఇప్పట్లో ఓ సినిమా 100 రోజులు ఆడటమనేది చాలా అరుదు. అయితే ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'మహర్షి' ఆ ఘనత సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు చోట్ల సెంచరీ కొట్టింది. వీటిలో నేరుగా వందల రోజులు ప్రదర్శించబడిన థియేటర్స్ మూడు(వైజాగ్, చిలకలూరిపేట, ఆదోని). మరో రెండు మార్చిన సెంటర్స్.
వీకెండ్ అగ్రికల్చర్(వారాంత వ్యవసాయం) అనే కొత్త కథాంశంతో ఈ సినిమా తీశారు. కంపెనీ సీఈఓ, రైతుగా కనిపించి అలరించాడు మహేశ్‌బాబు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. అల్లరి నరేశ్ కీలక పాత్ర చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. వంశీ పైడిపల్లి దరకత్వం వహించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు'లో ఆర్మీ మేజర్ పాత్ర పోషిస్తున్నాడు సూపర్‌స్టార్. రష్మిక మందణ్న కథానాయిక. అనిల్ రావిపూడి దర్శకుడు. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: ఆ చిత్రాలతో మియా సంపాదన ఎంతో తెలుసా..!