ETV Bharat / sitara

ఈ కొన్నాళ్లు మనమంతా మహానుభావులమే! - కరోనా లక్షణాలు

మారుతి తెరకెక్కించిన 'మహానుభావుడు'లో హీరో శర్వానంద్ అతి శుభ్రత పాటిస్తుంటాడు. కానీ ఇప్పుడు కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు అలా మారాల్సిన పరిస్థితి. ఈ సందర్భంగా దర్శకుడు మారుతితో ముఖాముఖి.

మారుతి
మారుతి
author img

By

Published : Mar 20, 2020, 8:20 AM IST

ఒక అందమైన అమ్మాయి కరచాలనం కోసం చెయ్యిస్తే.. ఆ చేతికి ఎన్ని క్రిములున్నాయో ఏంటో అని అనుమానంగా చూస్తాడు ఆ అబ్బాయి. తినే బ్రెడ్‌ ముక్కపై కూడా అటూ ఇటూ ఊదికానీ నోట్లో పెట్టుకోడు. అంత నీటుగాడు అతను. ఎవరు తుమ్మినా, దగ్గినా ఆమడ దూరం పారిపోతాడు. అందుకే అందరూ అతణ్ని 'మహానుభావుడు' అన్నారు.

మారుతి తెరకెక్కించిన 'మహానుభావుడు' సినిమా ముచ్చట్లే ఇవన్నీ. అందులో కథానాయకుడు శర్వానంద్‌ అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ అనే మానసిక రుగ్మతతో అతిశుభ్రతని పాటిస్తుంటాడు. తెరపై అతని హంగామా ప్రేక్షకుల్ని బాగా నవ్వించింది. థియేటర్‌ నుంచి బయటికొచ్చాక ఇంత నీటుగాళ్లని భరించడం కష్టమే అనుకున్నారంతా. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితులు చూస్తుంటే ప్రతి ఒక్కరూ మహానుభావుడు కావల్సిందే అనిపిస్తోంది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోనూ ఆ సినిమానే గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మారుతిని 'ఈనాడు సినిమా' పలకరించింది.

కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ఇప్పుడంతా మీ 'మహానుభావుడు'ని గుర్తు చేసుకుంటున్నారు. గమనించారా?

నాక్కూడా చాలామంది సందేశాలు పంపించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా 'మహానుభావుడు' సినిమా గురించి ప్రస్తావిస్తున్నారు. ఆ సినిమా తీసినప్పుడు మరీ ఇలాంటోళ్లు ఉంటారా? అతి శుభ్రత అంటే మరీ ఇంత దారుణంగా ఉంటుందా? అని మాట్లాడుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్లూ విధిగా అలా మారాల్సిన పరిస్థితి. ఈ కొన్నాళ్లు మనమందరం మహానుభావులమే అన్నమాట. కరోనావల్ల ఇప్పుడంతా ఆ చిత్రాన్ని గుర్తు చేస్తుంటే అదో భిన్నమైన అనుభవం.

'మహానుభావుడు' కథ రాసేటప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉండేవి?

ఆ సినిమాలో కథానాయకుడి పాత్ర పేరు ఆనంద్‌. ఆ పాత్ర గురించి ఆలోచిస్తూ సన్నివేశాలు రాసుకుంటున్నప్పుడు, నిజంగా అతి చేసినట్టుందేమో కదా అనిపించేది. కానీ నవ్వించడం కోసం ఆ పాత్రని అప్పట్లో అలా డిజైన్‌ చేశా. ఎవరైనా తుమ్ముతున్నారంటే చాలు.. పారిపోతుంటాడు. హాస్పిటల్‌కి వెళితే మాస్క్‌ తగిలించుకుని అందరి ముక్కులకి శానిటైజర్‌ స్ప్రే కొట్టుకుంటూ వెళ్లిపోతుంటాడు. కానీ ఇలాంటి పరిస్థితులు నిజ జీవితంలో మనక్కూడా ఎదురవుతాయని, ప్రపంచం మొత్తం ఇలాగే చేస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. నిజంగా ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలుసుంటే, ఇంకా బాగా తీసుండేవాణ్నేమో.

ప్రస్తుతం మీ ఇంట్లో, కార్యాలయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

ఇంట్లో మా పిల్లలు నా 'మహానుభావుడు' సినిమాని తరచూ గుర్తు చేసి నవ్వుకునేవాళ్లు. ఆ సినిమాలోలాగే ఇప్పుడందరూ మాస్క్‌లు పెట్టుకుంటున్నారు. ఇక ఆ సినిమాను తీసిననేనెంత జాగ్రత్తగా ఉంటానో అర్థం చేసుకోండి. ఆ చిత్రం జరుగుతున్నంతకాలం తెలియకుండానే ఆ పాత్రతో ప్రయాణం చేశా. శానిటైజర్స్‌ వాడటం, కార్‌లో కూర్చున్నప్పుడు ఎవరైనా తుమ్మితే ఆ పాత్రయితే ఏం చేస్తుందో ఆలోచించడం, నేను కూడా అలా జాగ్రత్తలు తీసుకోవడం అలవాటైంది. ఇప్పుడు అదే పాటిస్తున్నా. ఈ వారం రోజులు మా ఆఫీసుకి ఎవ్వరూ రావొద్దని చెబుతున్నా. చాలా మంది ప్రముఖులు అందరికీ అర్థమయ్యేలా సూచనలు చెబుతున్నారు. వాటిని పాటిస్తే చాలు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రస్తుత పరిస్థితులు చూశాక... కరోనాపై కథ రాసుకోవాలనే ఆలోచన ఏమైనా తట్టిందా?

ఇలాంటి పరిణామాలపై ఒకొక్క దర్శకుడు ఒక్కో కోణంలో ఆలోచిస్తుంటారు. 'భలే భలే మగాడివోయ్‌'లో నాని, 'మహానుభావుడు'లోని శర్వానంద్‌... కరోనా టైమ్‌లో కలిస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలు కూడా వచ్చాయి.

'ప్రతి రోజూ పండగే' తర్వాత మీ జీవితం ఎలా ఉంది?

పండగలాగే ఉంది. ప్రస్తుతం కథ రాసుకుంటున్నా. ఇంకొక నెలలో పూర్తయిపోతుంది. అది పూర్తయ్యాకే ఏ హీరోకి చెప్పాలనేది ఆలోచిస్తా.

కరోనా వైరస్‌తో ప్రపంచమంతా స్తంభించిపోవడం చూస్తుంటే ఓ పౌరుడిగా మీకేమనిపిస్తోంది?

ఇలాంటి పరిస్థితుల్ని ఇదివరకు మనం ఎప్పుడూ చూడలేదు. ప్రపంచంలో ఏం జరిగినా దాని గురించి పదిహేను రోజులు మించి చర్చ ఉండదు. ఆ తర్వాత మరో కొత్త సమస్య వస్తుంది. కానీ కొన్ని నెలలుగా కరోనా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. ప్రముఖులు కూడా ఇదొక సామాజిక బాధ్యతగా భావించి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు డబ్బు గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఆరోగ్యం ఉంటే... అన్నీ ఉన్నట్టే. ఇదివరకు డబ్బుంటే దేన్నైనా ఎదిరించొచ్చు అనుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.