యువ హీరో నితిన్‌తో నటించిన చాలామంది నాయికలు, అతనితో రెండోసారీ ఆడిపాడారు. హిట్టు జోడీ అనిపించుకున్నారు. అలా మరోసారి నితిన్ - కీర్తి సురేష్ కలిసి నటించే అవకాశాలున్నట్లు సమాచారం. వీరిద్దరూ ప్రస్తుతం 'రంగ్‌దే'లో నటిస్తున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్ 'పవర్ పేట' అనే చిత్రం చేయబోతున్నాడు. అందులో కథానాయికగా కీర్తిని ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.

నితిన్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'పవర్ పేట' అనే చిత్రంలో మూడు విభిన్న పాత్రలు పోషించనున్నాడు. 'అంధాధున్' రీమేక్‌ను ఇటీవలే పట్టాలెక్కించాడు. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించబోతున్నాడు. అలాగే చంద్ర శేఖర్ యేలేటితో ఓ చిత్రం చేస్తున్నాడీ యువహీరో. ఈ మూవీకి 'చెక్' అనే టైటిల్‌ను చిత్రబృందం పరిశీలిస్తోంది.
ఇదీ చూడండి.. కరోనాను లెక్కచేయని నాని- మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్